సాధారణంగా నాయకులు తమ పంతం నెరవేరకపోయినా.. తాము అనుకున్నది జరగకపోయినా.. వెంటనే బలప్రదర్శనకు దిగుతుంటారు. కొన్నాళ్లుగా పాలిటిక్స్‌లో ఇది కామన్ అయిపోయింది. ఇలాంటి బల ప్రదర్శనలు చేయడం ద్వారా పార్టీలు.. పార్టీల నాయకులు దిగివచ్చి తమ కోరికలు నెరవేరుస్తారని అనుకుంటారు. గతంలో ఇలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నా యి. అయితే.. ఇవి అందరి దగ్గరాకాదు. పైగా.. వైసీపీ అధినేత జగన్ దగ్గర ఇలాంటి బల ప్రదర్శన రాజకీయాలు అసలే కుదర వు. గత ఎన్నికల్లోనూ అనేక మంది టికెట్ దక్కదని భావించిన బల ప్రదర్శనలకు దిగారు. దీంతో వారిపై పార్టీ సస్పెన్షన్ కొరడా ఝళిపించింది.
ఇప్పుడు ఏం జరిగిందంటే..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకు టికెట్ ఇచ్చే అవకాశం లేదనే ప్రచారం ఉంది. కొన్నాళ్లుగా ఆయన పార్టీలో చర్చనీయాంశం కూడా అయ్యారు. అయితే.. తాజాగా ఎన్నికలకు సంబంధిం చి ఇంచార్జుల మార్పులు, చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో పిలవకుండానే ఎలీజా తాడేపల్లికి బయలు దేరారు. హైకమాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యానని ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యే ఎలీజా, ఆయన వర్గం అధిష్ఠానంతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో సుమారు 100 కార్లతో ర్యాలీగా చింతలపూడి నుంచి తాడేపల్లికి బయలుదేరి వచ్చారు. ఎమ్మెల్యే ఎలీజా, ఆయన అనుచరులు సీఎం జగన్, వైసీపీ పెద్దలను కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఇలాంటి బల ప్రదర్శనలు వైసీపీకి కొత్త కాదని.. ఇలాంటి ఎత్తు గడలు ఫలించే అవకాశం లేదని పార్టీ నాయకులు అంటున్నారు. అనేక పరిణామాలను పార్టీ చవి చూసిందని.. ఎవరూ ఎక్కువ కాదని అంటున్నారు. గత ఎన్నికలకు ముందు కూడా చాలా మంది ఇలానే ప్రదర్శనలు చేసి నష్టపోయారని అంటున్నారు. అది కూడా సీఎం జగన్ వంటి నాయకుడి ముందు.. కుప్పిగంతులు వేస్తే.. మొత్తానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.