Political News

అన్నావారి అల‌క‌.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటున్నార‌ట‌!

గిద్ద‌లూరు వైసీపీ ఎమ్మెల్యే, వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన అన్నా రాంబాబు.. అల‌క బూనారు. ఒక్క రోజులో ఆయ‌న మాట మార్చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున గిద్ద‌లూరు నుంచి పోటీ చేసిన అన్నా.. రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ తెచ్చుకున్న రెండో నాయ‌కుడిగా పేరు తెచ్చుక‌న్నారు. అయితే.. ఆయ‌న దూకుడు స్వ‌భావ‌మే.. ఆయ‌న‌ను నాయ‌కుల‌కు దూరం చేసింది. మితి మీరిన అహంకారం కూడా ఉంద‌ని ఆయ‌న అనుచ‌రులే చెప్పుకొనే ప‌రిస్థితికి వ‌చ్చారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా వారు ఉద్య‌మాలు నిర్వ‌హించారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే వైసీపీ రెండేళ్ల కింద‌టే అలెర్ట్ అయింది. ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని సూచించింది. అయినా.. అన్నా ఎదురు దాడికి దిగార‌నేది వైసీపీ నేత‌ల మాట‌. ఇదిలావుంటే, 2022లో జ‌రిగిన మంత్రి వ‌ర్గం రెండో సారి విస్త‌ర‌ణ‌లో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని ఆరోపిస్తూ.. రోడ్డెక్కారు. పార్టీపై నింద‌లేశారు. మ‌రోవైపు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిఖార్సుగా చేయాల‌ని పార్టీ పిలుపునిస్తే.. మొక్కుబ‌డిగా చేశార‌నే నివేదిక‌లు కూడా అందాయి. ఈ ప‌రిణామాల‌తో ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ ప‌రిణామాల‌ను జీర్ణించుకోలేక పోయారో.. లేక వైసీపీపై వ్య‌తిరేక‌త పెంచుకున్నారో తెలియ‌దు కానీ, మంగ‌ళ‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్న‌ట్టు చెప్పారు. అంతేకాదు.. ప్ర‌కాశం జిల్లా నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లే తొలి నాయ‌కుడు తానేన‌ని కూడా చెప్పేశారు. అయితే.. టీడీపీలో గ‌తంలో ఆయ‌న చేసిన యాగీ అంతా ఇంతా కాదు. పార్టీ అధినేత‌కు స‌మాంతరంగా ఆయ‌న పావులు క‌దిపి నిత్యం వివాదాలు కొని తెచ్చుకున్నారు. దీంతో ఆపార్టీ ఆయ‌న‌ను అప్ప‌ట్లో స‌స్పెండ్ చేసే ప‌రిస్థితి వ‌చ్చింది.

మ‌ళ్లీ ఇప్పుడు పోయి పోయి.. నిప్పుల కుంప‌టిని తెచ్చుకునే ఉద్దేశం టీడీపీకి లేదు. అన్నా పార్టీలోకి వ‌స్తాన‌ని చెప్పినా.. టీడీపీ నుంచి సానుకూల ప‌రిణామాలు క‌నిపించ‌లేదు. దీంతో 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే అన్నా మాట మార్చేశారు. తాను రాజ‌కీయాల‌కు దూరం అవుతాన‌ని.. వైసీపీ టికెట్ ఎవ‌రికి ఇచ్చినా.. త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని.. చెప్పుకొచ్చారు. సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌లు కూడా గుప్పించారు. అంతేకాదు.. పార్టీ నాయ‌కులు ఐక్యంగా ముందుకు సాగాల‌ని.. ప‌ద‌వులు పొందిన పార్టీని గెలిపించుకోవాల‌ని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే.. అన్నావారి అల‌క తీర‌క‌పోయే స‌రికి.. ఇత‌ర పార్టీల్లోనూ ఆయ‌నకు దారులు మూసుకుపోయే స‌రికి.. వ్యూహాత్మ‌కంగా మాట మార్చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 27, 2023 9:48 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

1 hour ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

1 hour ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago