Political News

మేము పూర్తిగా వాడేశాం. ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయింది..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌తో భేటీ కావ‌డం.. సుమారు 4 గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం తెలిసిందే. ఈ ప‌రిణామంపై వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఇండియా కూట‌మిలో చంద్ర‌బాబును చేర్పించుకునేందుకే ప్ర‌శాంత్ కిషోర్ చ‌ర్చ‌లు జ‌రిపాడని అన్నారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా… సీఎం జగన్ ను పీకేదెం ఉండదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అన్నారు.

సీఎం జగన్, మేము రోజు చెబుతూనే ఉన్నాం..ఇప్పుడు ప్రశాంతి కిషోర్ ను కలిస్తే భూమి బద్దలై పోతుందా. ప్రశాంత్ కిషోర్ ను మేము పూర్తిగా వాడేశాం. ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయింది. మా వ్యూహకర్తగా ఉన్నప్పుడు బీహార్ నుండి వచ్చిన‌ ప్రశాంత్ కిషోర్‌ను `ఏం పికుతాడు తమ్ముళ్లు` అన్న చంద్రబాబు.. ఇప్పుడు ఏం పీకడానికి భేటీ అయ్యాడో పసుపు తమ్ముళ్లకు చెప్పాలి అని కొడాలి నిల‌దీశారు.

పీకే సూచనలతో బాబాయ్ ని చంపి, జగన్ కోడి కత్తి డ్రామాలు ఆడారని ఎల్లో మీడియా గగ్గోలు పెట్టిందని, మరి ఇప్పుడు చంద్రబాబు పీక కోయించుకోడానికి, లోకేష్ త‌న‌ తండ్రిని చంపడానికి ప్లాన్ వేస్తున్నారా? అని కొడాలి ప్ర‌శ్నించారు. ప్రశాంతి కిషోర్ కు, ఐప్యాక్ కు సంబంధం లేదన్నారు. ఇండియా కూటమిలో చేరమని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ వచ్చారని చెప్పారు.

పార్ట‌న‌ర్‌ పీకే(ప‌వ‌న్ క‌ళ్యాణ్‌) బీజేపీతో చర్చలు జరుపుతుంటే.. మరో పీకే(ప్ర‌శాంత్ కిషోర్‌) ఇండియ కూటమి, మమతా బెనర్జీ, కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నాడని కొడాలి చెప్పారు. చంద్రబాబు తన రెండు కళ్ళ సిద్దాంతాన్ని కొనసాగిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

This post was last modified on December 24, 2023 3:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప‌ద‌హారు వేల‌ ప‌దవులు.. చంద్ర‌బాబు బీసీ మంత్రం.. !

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రో బీసీ మంత్రాన్ని ప‌ఠిస్తున్నారు. వారికి ఇప్ప‌టికే.. స‌రైన స‌ముచిత ప్రాధాన్యం క‌ల్పించిన…

2 hours ago

బాబీని ఇబ్బంది పెట్టిన ఆ సినిమా ఏది?

‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…

2 hours ago

మరణశిక్షపై ట్రంప్ కఠిన వైఖరి!

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ మరణశిక్ష అమలుపై తన కఠినమైన వైఖరిని వ్యక్తం చేశారు.…

2 hours ago

పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఇంకా తగ్గలేదు

మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు వారాల తర్వాత బాగా నెమ్మదించిపోతుంది. మొదటి పది…

3 hours ago

ఉస్తాదుకి పనికొచ్చే బేబీ జాన్ పొరపాట్లు !!

పెద్ద అంచనాలతో బాలీవుడ్ మూవీ బేబీ జాన్ రిలీజయ్యింది. విజయ్ బ్లాక్ బస్టర్ తెరీ రీమేక్ గా అట్లీ నిర్మాణంలో…

3 hours ago