బ‌ట‌న్ నొక్కే ముందు.. మ‌న‌మే గుర్తుకు రావాలి..

రాష్ట్రంలో అధికార వైసీపీలో చెల‌రేగిన రాజీనామాలు.. పార్టీ ఇంచార్జ్‌ల మార్పు వంటివి రాజ‌కీయంగానే కాకుండా.. ప్ర‌జ‌ల మ‌ధ్య కూడా తీవ్ర‌మైన చ‌ర్చ‌గానే మారాయి. స్థానికంగా నేత‌లు కొంత మేర‌కు ఆందోళ‌న కూడా చేశారు. అయితే.. దీనిపై సాగుతున్న చ‌ర్చ‌లో భాగంగా..వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ విజ‌యం ద‌క్కిం చుకుంటుంది? ఏ పార్టీకి ఓటేయాల‌నే చ‌ర్చ కూడా సాగుతోంది.

ఏ ఇద్ద‌రు బ‌డ్డీ కొట్టు ద‌గ్గ‌ర చేరినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓటెవ‌రికి భాయ్! అనే కామెంటే వినిపిస్తోంది. అయితే.. ఇక్క‌డ గ‌త 2019 ఎన్నిక‌ల వేళ జ‌రిగిన ప‌రిణామాలు కూడా తెర‌మీదికి వ‌స్తున్నాయి. జ‌నాల‌కు అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాలు.. సంక్షేమ పాల‌న నేప‌థ్యంలో వైసీపీకి నేరుగా ఓటేసేందుకు జ‌నాలు రెడీగా ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ ప‌థ‌కాలు.. గ‌తంలోనూ టీడీపీ ప్ర‌భుత్వం చేసింది క‌దా! అనే చ‌ర్చ‌కూడా వ‌స్తోంది.

నిజ‌మే.. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం ఏకంగా ఎన్నిక‌ల‌కు ముందు.. మ‌ధ్య‌లోనూ ప‌సుపు-కుంకుమ పేరుతో మ‌హిళ‌ల‌ను కేంద్రంగా చేసుకుని రూ.10 వేల‌ను(4+4+2 వేల చొప్పున‌) పంచింది. అయినా.. మ‌హిళ‌లు టీడీపీతో లేరు. వైసీపీకి ఓటెత్తారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు కూడా.. ఇలానే వైసీపీ ఇస్తున్న సొమ్ములు తీసుకున్నా.. ఓటేస్తారో లేదో అనే చర్చ సాగుతోంది. అయితే.. ఈ విష‌యంపై వైసీపీ నిర్దిష్ట అభిప్రాయంతో ఉంది.

ఇక్క‌డ వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కు కూడా.. ఎక్క‌డా క్ర‌మం త‌ప్ప‌కుండా వైసీపీ ప్ర‌భుత్వం ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. సో.. పోలింగ్ బూత్‌కు వెళ్లిన మ‌హిళ‌ల‌కు.. ఖ‌చ్చితంగా బ‌ట‌న్ నొక్కే ముందు.. తాను తీసుకున్న సొమ్ము.. త‌న కుటుంబానికి జ‌రిగిన ల‌బ్ది వంటివి గుర్తుకురావ‌డం ఖాయ‌మ‌ని, ఆ విధంగా క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుకున్న‌వారిని మోటివేట్ చేయాల‌ని పార్టీ అధిష్టానం సూచ‌న‌లు చేసిందని నాయ‌కులు చెబుతున్నారు.