ఇక ధరణిపై ఫోకస్

కేసీయార్ ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదమైన విషయం ఏదన్నా ఉందా అంటే అది ధరణి పోర్టల్ మాత్రమే. చాలా శాఖల్లో జరిగిన అవకతవకలు, అవినీతి కూడా జనాలపైన ప్రభావం చూపుతుందనటంలో సందేహంలేదు. అయితే వాటి ప్రబావం జనాలపైన డైరెక్టుగా ఉండదు. కానీ ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలు జనాలపై డైరెక్టుగా ప్రభావం చూపుతుంది. ఎలాగంటే భూ వివరాలు పోర్టల్లో తప్పులుగా నమోదైతే దాన్ని సవరించుకరని కరెక్టు చేసుకోవటానికి సదరు భూ యజమానికి చుక్కలు కనిపించాయి.

ఇలాంటి తప్పులు ఒకచోట రెండుచోట్ల కాదు ముగ్గురు లేకపోతే నలుగురు యజమనాలు కాదు ఇబ్బందులు పడింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షలమంది యజమానులు తమ భూ వివరాలు పోర్టల్లో తప్పులుగా నమోదైనట్లు ఫిర్యాదులు చేసినా అధికారయంత్రాంగం అస్సలు పట్టించుకోలేదు. తప్పులు దొర్లుతున్నట్లు ఉన్నతాధికారులు, యంత్రాంగం కేసీయార్ కు చెప్పకుండా మభ్యపెట్టారు. ధరణిలో తప్పులున్నాయని కేసీయార్ కు చెప్పటానికి మంత్రలు కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే కేసీయార్ ధరణిపోర్టల్ ను గుడ్డిగా సమర్ధించటమే.

వీటికి అదనంగా జనాల్లో నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ కేసీయార్ కు చేరలేదు. ఎందుకంటే కేసీయార్ ఏనాడైనా జనాలను, ఎంఎల్ఏలను కలిస్తే కదా జరుగుతున్న తప్పులను తెలుసుకునేందుకు. దాంతో లక్షల మంది యజమానులు ధరణిపోర్టల్+కేసీయార్ పైన బాగా మండిపోయారు. ఇలాంటి ధరణి పోర్టల్ పనితీరుపైన రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు సమాచారం. ప్రజావాణిలో జనాల నుండి వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికం ధరణి పోర్టల్ పైనే వస్తున్నాయట. అందుకనే వస్తున్న ఫిర్యాదులను ఆధారంచేసుకుని పోర్టల్ నిర్వహణలో జరిగిన తప్పులు, అందుకు బాధ్యులను గుర్తించే పని జరుగుతోందట.

అర్ధరాత్రుళ్ళు కూడా ధరణిలో రిజిస్ట్రేషన్లు జరిగాయని, మార్పులు, చేర్పులు ఎక్కువగా అర్ధరాత్రిళ్ళే జరిగినట్లు ఇప్పటికే కొత్త ప్రభుత్వ గుర్తించింది. అందుకనే ఫోరెన్సిక్, కమ్యూనిటి ఆడిటింగ్ కు రేవంత్ ప్రభుత్వం రెడీ అవుతోంది. గ్రామాల్లోకి వెళ్ళి ఫిర్యాదులు చేసిన భూ యజమానులతో నేరుగా మాట్లాడాలని కూడా ఆలోచిస్తున్నది. కేసీయార్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్లో జరిగిన కంపు మొత్తాన్ని జనాలముందుంచటమే రేవంత్ ప్రభుత్వం లక్ష్యంగా అర్ధమవుతోంది. అదే జరిగితే ఎంతస్ధాయిలో అవకతవకలు బయటపడతాయో చూడాలి.