వారు.. వీరు.. 30 మంది కొత్త‌వారు: వైసీపీ ఎన్నిక‌ల పంజా!

jagan

వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఏపీలో ఒకే విడ‌త‌లో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రెండు ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు వైసీపీ ఎన్నిక‌ల పంజా విసురుతోంది. ఈ క్ర‌మంలో త‌న మ‌న అనే తేడా లేకుండా.. గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు సంకేతాలు కూడా పంపే సింది. ఇప్ప‌టికే కీల‌క‌మైన ఆళ్ల రామ‌కృష్నారెడ్డి రాజీనామాతో ప్రారంభ‌మైన ఈ ప‌రంప‌ర మ‌రింత వేగంగా ముందుకు సాగుతుంద‌ని అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో 25 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ద్వారా.. కేంద్రంలో నూ చ‌క్రం తిప్పాల‌ని వైసీపీ నిర్ణ‌యించుకుంద‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌లలో 22 మంది పార్ల‌మెంటు అభ్య‌ర్థుల‌ను గెలిపించుకున్న వైసీపీకి కేంద్రంలోని మోడీ స‌ర్కారు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేసింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఏపీకి ఏమీ చేయ‌కుండా ప‌ద‌వులు ఇస్తే.. ప్ర‌యోజ‌నం ఏంట‌న్న ధోర‌ణిలో ఆ పార్టీ ప‌ద‌వులు తీసుకునేందుకు దూరంగా ఉంది.

అయితే.. ఈ సారి మాత్రం ప‌ద‌వులు తీసుకుని.. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం పోరాడాల‌నే నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేయాల‌ని చూస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో 25 స్థానాల‌పైనా ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది. ఇక‌, రాష్ట్రంలో వైనాట్ 175 నినాదాన్ని కూడా బ‌లంగా తీసుకువెళ్లాల‌ని.. అన్ని సీట్ల‌లోనూ విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా అడుగులు వేయాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఎంపీ స్థానాల్లో ఉన్న‌వారిని అసెంబ్లీకి పంపించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ ద‌ఫా ఏకంగా 30 మంది కొత్త ముఖాల‌కు టికెట్‌లు ఇవ్వాల‌ని.. వీరిలో 20 మంది మ‌హిళా నేత‌ల‌నే ఎంచుకోవ‌డం ద్వారా రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల్లో ఎలాగైతే.. 50 శాతం మ‌హిళా కోటా అమ‌లు చేశారో.. ఇప్పుడు 33 శాతం మంది మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లోనూ చోటు క‌ల్పించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా ఎమ్మెల్యేల్లో బ‌ల‌మైన వారిని పార్ల‌మెంటు అభ్య‌ర్థులుగా.. ఈ స్థానాల్లోని వారిని అసెంబ్లీకి, అదేస‌మ‌యంలో 30 మంది కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.