తెలుగు మీడియా రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఎన్టీవీ న్యూస్ ఛానల్ 13 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 13 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలను సాధించిన ఎన్టీవీ ఏ ఒక్కరికి అనుకూలంగా ఉండకుండా నిజమైన వార్తలను నిక్కచ్చిగా ప్రసారం చేస్తూ, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచింది ఎన్టీవీ.
ఇటు ప్రజలకు అవసరమైన వార్తలను అందిస్తూనే మరోవైపు ధార్మిక కార్యక్రమాలను సైతం చేపడుతున్నది. 2013 నుంచి కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, మఠాధిపతులు, జాతీయ స్థాయి నాయకులు కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. జాతీయ సమైక్యతను ప్రతిబింబించే విధంగా జనగణమన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్టీవీ సొంతం.
13 వార్షికోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ తదితరులు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేయడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates