కాంగ్రెస్ డేరింగ్ స్టెప్

పోలింగుకు వారం రోజులముందు పార్టీలోని కొందరు నేతలను బహిష్కరించటం అంటే ఊహించలేం. అధికారికంగా పోటీచేస్తున్న అభ్యర్ధులకు సహకరించటంలేదని తెలిసినా మామూలుగా ఏ పార్టీ కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోదు. ఎందుకంటే పార్టీ నష్టంచేస్తున్న నేతలపై యాక్షన్ తీసుకుంటే ఇంకెంత కంపుచేస్తారో అనే భయం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటి భయాలు పెట్టుకోకుండా వెంటనే కొందరిపై బహష్కరణ అస్త్రాన్ని ప్రయోగించేసింది. దాంతో మిగిలిన జిల్లాల్లోని కొందరు అసంతృప్తనేతలు దారికి వస్తున్నట్లు సమాచారం.

ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులకు మనస్పూర్తిగా సహకరిస్తున్నది ఎవరు ? వ్యతిరేకంగా చేస్తున్నది ఎవరనే విషయాన్ని పార్టీ అనేకమార్గాల్లో రిపోర్టు తెప్పించుకుంటోంది. ఇలాంటి రిపోర్టులు తెప్పించుకుని నార్ధారణ చేసుకుని పరిస్ధితులను విశ్లేషించేందుకే పార్టీ ఆపీసులో ప్రత్యేకించి వార్ రూమ్ అని ఏర్పాటుచేసింది. ఈ రూములో 24 గంటలూ ఫిఫ్టు సిస్టమ్ లో దాదాపు 15 బృందాలు పనిచేస్తునే ఉన్నాయి. వీటిని పర్యవేక్షించటానికి వ్యూహకర్తలు కూడా అందుబాటులోనే ఉన్నారు.

ఇదే విషయమై నేతలపై యాక్షన్ తీసుకునే ఉద్దేశ్యంతోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ లోనే మకాం వేశారు. ఆయన నిరంతరం రిపోర్టుల విశ్లేషణలోనే ఉంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కొందరు అభ్యర్ధుల గెలుపుకు మరికొందరు నేతలు ఏమాత్రం సహకరించటంలేదని రిపోర్టులు అందాయి. గెలుపుకు సహకరించకపోగా ఓటమికి ప్రత్యర్ధులతో చేతులు కలిపినట్లు సమాచారం అందింది. దాన్ని పార్టీలోని ఇంటర్నల్ వర్గాల ద్వారా వార్ రూమ్ నుండి అవసరమైన సమాచారాన్ని క్రాస్ చెక్ చేయించుకున్నారు.

తమకు అందిన సమాచారం నిజమే అని నిర్ధారించుకోగానే కొందరు సీనియర్లను బహిష్కరించేశారు. ఇండిపెండెంటుగా పోటీచేస్తున్న సంజీవరెడ్డి, జిల్లా డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, లోకల్ లీడర్లు భార్గవ్ దేశ్ పాండే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతపై బహిష్కరణ వేటు పడింది. పోలింగ్ దగ్గరలోనే ఉన్నా రెండో ఆలోచన లేకుండా వీళ్ళని అధిష్టానం బహిష్కరించటంతో ముందు షాక్ తిన్నారు. తర్వాత అధిష్టానం మంచిపనే చేసిందని హ్యాపీ ఫీలయ్యారు. ఈ చర్యతో మిగిలిన జిల్లాల్లోని నేతలు దారిలోకి వచ్చినట్లు సమాచారం.