ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జనాలందరి దృష్టి కామారెడ్డి పైనే పడుతోంది. దీనికి కారణం ఏమిటంటే మూడుపార్టీల తరపున పోటీ చాలా టైటుగా ఉండటమే. నిజానికి కామారెడ్డికి ఇంతటి క్రేజు రావటానికి ప్రధాన కారణం కేసీయార్ అనే చెప్పాలి. గజ్వేలుతో పాటు కామారెడ్డిలో కూడా పోటీచేయబోతున్నట్లు ఎప్పుడైతే కేసీయార్ ప్రకటించారో అప్పటినుండే నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇదే సమయంలో కేసీయార్ మీద పోటీకి తాను రెడీ అవుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో హీట్ మరింతగా పెరిగిపోయింది.
ఇపుడు పరిస్ధితి ఎలాగ తయారైందంటే కేసీయార్-రేవంత్ మధ్య పోటీ గట్టిగా ఉందంటే వీళ్ళకి బీజేపీ అభ్యర్ధి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చాలెంజ్ విసిరారు. దాంతో ఎన్నికల వేడి బాయిలింగ్ స్టేజికి చేరుకున్నది. లాజికల్ గా అయితే కేసీయార్ ఓటమిని ఎవరూ ఊహించలేరు. కానీ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా కేసీయార్ తో పాటు బీఆర్ఎస్ మీద కూడా జనాల్లో బాగా వ్యతిరేకత కనబడుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కి అనుకూలంగా జనాలు మాట్లాడుకుంటున్నారు. వ్యక్తిగతంగా రేవంత్ మీద జనాల్లో క్రేజుంది.
ఇదే సమయంలో బీజేపీ అభ్యర్ధి వెంకటరమణారెడ్డికి వ్యక్తిగతంగా నియోజకవర్గంలో బాగా పట్టుంది. పార్టీతో సంబంధంలేకుండానే వ్యక్తిగతంగా బలమైన కేడర్ ను డెవలప్ చేసుకున్నారు. ఆర్ధికంగా బాగా స్ధితిమంతుడు కావటంతో సొంతడబ్బులు పెట్టి రాజకీయం చేస్తున్నారు. దాంతో ఈయనకు నియోజకవర్గంలో మంచి పేరువచ్చింది. పైగా కాటిపల్లి లోకల్ లీడరన్న పేరు కూడా ఉంది. మిగిలిన ఇద్దరు బయట వాళ్ళనే చెప్పాలి.
చెప్పుకోవటానికి కామారెడ్డి నియోజకవర్గం కేసీయార్ తల్లిదని అంటున్నారు. కానీ ఏనాడు కేసీయార్ ఆ పేగుబంధంతో నియోజకవర్గాన్ని డెవలప్ చేసిందిలేదు. పైగా నియోజకవర్గంలో రైతులతో పాటు చాలా వర్గాలు మండిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే జనాలు మొగ్గు ఎవరివైపు ఉంటుందనే విషయంలో బాగా కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. అందుకనే సర్వే సంస్ధలు, మీడియా సంస్ధలు కూడా సర్వేల మీద సర్వేలు చేస్తున్నాయి జననాడిని పట్టుకునేందుకు.