ఆ 10 కోట్లు ఎవ‌రి ఖాతాలోవి?

ప‌ది కోట్లు.. ప్ర‌భుత్వాల విష‌యంలో ఏమంత పెద్ద ఎమౌంట్ కాక‌పోవ‌చ్చు. కానీ, ఎన్నిక‌ల వేళ ప‌ది ల‌క్ష‌లై నా కూడా రాజ‌కీయంగా ప్ర‌భావం చూపుతుంది. దీంతో సొమ్ముపై ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ నిఘా ఎప్పుడూ ఉంటుం ది. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే ఏపీలోనూ క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం “వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్” (ఏపీకి జ‌గ‌నే ఎందుకు కావాలి) అనే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది.

ఈ కార్య‌క్ర‌మం పూర్తిగా వైసీపీకి చెందినదే!. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి సీఎంగా జ‌గ‌న్‌కు ఎందుకు అవ‌కా శం ఇవ్వాలి? ఆయ‌న ఇప్పుడు చేస్తున్న కార్య‌క్ర‌మాలు, అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, ఏయే కుటుంబాల‌కు ఎంత ల‌బ్ధి చేకూరింది? వంటి వివ‌రాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేసి.. త‌ద్వారా వారిని త‌మ‌వైపు తిప్పుకోవాల‌నే ది ప్ర‌ధాన ఉద్దేశం. అంతేకాదు.. ఉయ్ నీడ్ జ‌గ‌న్‌(జ‌గ‌న్ మాకు అవ‌స‌రం) అని ప్ర‌జ‌ల‌తో అనిపించుకోవా లనే కాన్సెప్టు కూడా ఉంది.

మొత్తంగా ఇది పార్టీ కార్య‌క్ర‌మం. అయితే.. దీనిలో అధికారుల‌ను సీఎం జ‌గ‌న్ ఇన్వాల్వ్ చేశారు. క‌లెక్ట‌ర్ల నుంచి ఉన్న‌తాధికారుల వ‌ర‌కు క్షేత్ర‌స్థాయిలో గ్రామ అధికారుల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌ది రోజుల పాటు నిర్వ‌హించాల‌ని నిర్దేశించారు. మొత్తానికి ఈ కార్య‌క్ర‌మం కూడా ప్రారంభ‌మైంది. అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి 24 పేజీల‌తో ముద్రించిన బ్రోచ‌ర్ ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఈ బ్రోచ‌ర్ రూపొందించేందుకు ప్ర‌భుత్వం రూ.10 కోట్ల‌పైచిలుకు వ్య‌యం చేసింద‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఆ వెంట‌నే ఈ విష‌యాన్ని కేంద్రానికి స‌మాచారం కూడా ఇచ్చిన‌ట్టు స‌మాచారం. దీంతో ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితం కోసం బీజేపీ కూడా ఎదురు చూస్తున్న నేప‌థ్యంలో లెక్క‌లు తేల్చాలంటూ.. రాష్ట్ర నేత‌లు డిమాండ్ చేశారు. ఈ ప‌రిణామాల‌పై రూ.10 కోట్లు ఎవ‌రి ఖాతాలోవి? అంటూ.. కేంద్రం ఆఘ‌మేఘాల‌పై ఆరా తీయ‌డం ప్రారంభించింది. మ‌రి దీనికి వైసీపీ ఏం చెబుతుందో చూడాలి. ఇప్ప‌టికే కేంద్రం ఇస్తున్న నిధుల‌ను దారిమ‌ళ్లిస్తున్నారని.. మీ పేరు వేసుకుంటున్నార‌ని.. బీజేపీ పెద్ద‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నేప‌థ్యంలో తాజా ప‌రిణామం రాజ‌కీయ వివాదంగా మారింది.