త‌న‌యుడి కోసం తండ్రి పాట్లు.. గ‌తాన్ని ఏక‌రువు పెట్టి మ‌రీ!

లాంగ్ లాంగ్ ఎగో.. అంటూ… తన కుమారుడి విజ‌యం కోసం.. గతాన్ని త‌వ్వేస్తున్నారు మాజీ మంత్రి, కాం గ్రెస్ నాయకుడు కుందూరు జానా రెడ్డి. మీ కోసం నేన‌ప్పుడు అది చేశా.. నా కోసం మీరిప్పుడు మా అబ్బాయి ని గెలిపించండి! అంటూ.. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థిస్తున్నారు. సాగ‌ర్ నియోజ‌క వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా జానా రెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా నోముల న‌ర‌సింహ‌య్య కుమారుడు భ‌గ‌త్ ఉన్నారు.

ఇరువురు యువ‌కులే కావ‌డం.. ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులు కావ‌డం.. పోటీ తీవ్రంగా ఉండ‌డంతో ఇరు ప‌క్షాల్లో నూ పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రికి త‌గిన విధంగా వారు ప్ర‌చారంలో జోరుగా సాగుతు న్నారు. ప్ర‌త్య‌ర్తి లోపాల‌ను ఎత్తిచూపుకొంటున్నారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాక మ‌రింత పెరిగింది. ప్ర‌చారానికి దాదాపు 20 రోజుల స‌మ‌యం ఉండ‌డంతో ఎవ‌రికి వారు దీటుగా ప్ర‌చార‌న్ని ముమ్మ‌రం చేశారు.

ఈ క్ర‌మంలో జైవీర్ త‌ర‌ఫున జానా రెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. గ్రామీణ స్థాయిలో త‌న ప‌లుకుబ డిని ఉప‌యోగించి.. బీఆర్ ఎస్ నుంచి నాయ‌కుల‌ను లాగేసుకుంటున్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో గ‌తాన్ని త‌వ్వుతున్నారు. తాను అనేక ప‌ర్యాయాలు ఇక్క‌డ నుంచి గెలిచి.. అనేక ప‌నులు చేశాన‌ని చెబుతున్నారు. ఇక్క‌డ అభివృద్ధి చేసిన ఘ‌త‌న త‌న‌దేన‌ని అంటున్నారు. అయితే.. ఇంకా అభివృద్ధి మిగిలి ఉంద‌ని.. దానిని త‌న కుమారుడు జైవీర్ రెడ్డి చేస్తార‌ని జానా రెడ్డి చెబుతున్నారు.

మొత్తంగా.. కుమారుడి కోసం.. అహ‌ర్నిశ‌లూ.. జానా క‌ష్ట‌ప‌డుతున్నార‌నే చెప్పాలి. 2014 ఎన్నిక‌ల్లో సైతం ఇక్క‌డ నుంచి గెలిచిన జానా.. 2018లో నోముల న‌ర్సింహ‌య్య(క‌మ్యూనిస్టుగా ఉంటూ.. బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు) చేతిలో ఓడిపోయారు. త‌ర్వాత‌.. నోముల మ‌ర‌ణంతో వ‌చ్చిన బై పోల్‌లోనూ జానా పోటీ చేశారు. అయితే, అప్పుడు కూడా ఆయ‌న ఓట‌మి చెందారు. ఇక‌, ఇప్పుడు తన వార‌సుడి విజ‌యం కోసం త‌పిస్తున్నారు. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.