ప్రధాని నరేంద్ర మోడీ గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశాని కి మోడీ అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. ఆయన చూపిన దిశానిర్దేశం భవిష్యత్తులో ఈ దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుందని కూడా చెప్పారు. దేశానికి మోడీని దార్శనికుడిగా పవన్ అభివర్ణించా రు. అంతేకాదు.. దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించగల సత్తా, ధైర్యం, సామర్థ్యం ఉన్నాయని ప్రశంసించారు.
“మోడీ మన దేశానికి కీలకమైన ఒక దార్శనిక నాయకుడు.. ఆయన ఎన్నో సవాళ్లను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న నేత.. బలమైన దృక్పథాన్ని వ్యక్తీకరించడం, ఐక్యతను పెంపొందించడం.. వివిధ రంగాలలో పరివర్తనాత్మక మార్పును నడిపించడం ద్వారా దేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించే సామర్థ్యం మోడీకి ఉంది” అని అన్నారు.
దేశంలో దీర్ఘకాలిక అభివృద్ధి, భవిష్యత్తు తరాల శ్రేయస్సుపై ఆలోచన చేస్తారని మోడీని పవన్ కొనియాడారు. మోడీ ‘విజన్ 2047’ని సాకారం చేయడానికి… జనసేన పార్టీ బీజేపీకి, మోడీకి మద్దతు ఇస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పవన్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ జనసేనపార్టీకి 9 స్థానాలు కేటాయించింది. బీజేపీ-జనసేన తరఫున పవన్ ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ వేదికగా తన ప్రచారాన్ని ప్రారంభించేసినట్టేనని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates