ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం జగన్‌ను ఆ పార్టీ నాయకులు తరచుగా ఆకాశానికి ఎత్తేస్తున్న విషయం తెలిసిందే. జగన న్న.. అంటూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున మోసేస్తుంటారు. ఆయనను దేవుడని అనేవారు కొందరైతే.. దేవుడిని మించిన దేవుడు అనేవారు మరికొందరు ఉన్నారు. ఇక, తాజాగా వైసీపీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సీఎం జగన్‌ను ఏకంగా విష్ణుమూర్తి స్వరూపం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అంతేకాదు.. జగన్ విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఆయనను దూషించడం కూడా మహాపాపమని.. అలా దూషించిన వారు ఏమైపోతారో కూడా చెప్పలేమని అన్నారు.
ఎంపీ మార్గాని భరత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “జగన్‌ను ఇటీవల కాలంలో కొందరు దూషిస్తున్నారు. ఇది చాలా తప్పు. జగన్ అంటే ఎవరు.. జగన్నాథుడు. విష్ణు స్వరూపం. జగన్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది. పూరీ వెళ్లారా? అక్కడ జగన్నాథుడు ఉన్నాడు. భక్తితో కొలుస్తాం. ఇక్కడ జగన్ కూడా అంతే. జగన్నాథుడితో సమానం. ఇవన్నీ విష్ణుమూర్తి స్వరూపాలు. విష్ణు అంశలు. జగన్‌ను దూషించొద్దు” అని వ్యాఖ్యానించారు.
అయితే, ఎంపీ భరత్ చేసిన ఈ వ్యాఖ్యలపై జనసేన నాయకులు తీవ్రంగా స్పందించారు. భరత్‌ను తక్షణమే విశాఖ మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని ఆ పార్టీ నాయకుడుకిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు. జగన్‌కు భజన చేసుకోవాలంటే ఇంటి దగ్గరో.. పార్టీ కార్యాలయంలోనో చేసుకోవాలని, కానీ, పవిత్రమైన తిరుమల కొండపై కాదని సూచించారు.ఇ దిలావుంటే.. భరత్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఆయనను మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలి బ్రో! అని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మరికొందరు భజన పీక్ కు వెళ్లిందంటే.. వచ్చే ఎన్నికల్లో టికెట్దక్కుతుందో లేదో అనే భయం ఉండొచ్చు! అందుకే జగన్‌ను ఇంతగా ఎత్తేస్తున్నాడని మరికొందరు వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates