Political News

ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుకు విజయ దశమి పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం పండుగను ఆనందంగా జరుపుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రజలకు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు.

తాను జైలులో లేనని, ప్రజ‌ల హృద‌యాల్లో ఉన్నానని చంద్రబాబు అన్నారు. ప్రజ‌ల నుంచి తనను ఎవ్వరూ దూరం చేయ‌లేరని, 45 ఏళ్లుగా తాను కాపాడుకుంటూ వ‌స్తున్న విలువ‌లు, విశ్వస‌నీయ‌త‌ను ఎవరూ చెరపలేరని అన్నారు. ఆల‌స్యమైనా న్యాయానిదే అంతిమ విజయమని, త్వర‌లో బ‌య‌టికొచ్చి ప్రజ‌ల కోసం, రాష్ట్ర ప్రగ‌తి కోసం రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేస్తానని చెప్పారు. ఓట‌మి భయంతో తనను జైలులో పెట్టారని, ప్రజ‌ల మ‌ధ్యలో లేక‌పోయినా అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా క‌నిపిస్తానని చెప్పారు.

45 ఏళ్ల ప్రజా జీవితం తన క‌ళ్ల ముందు కదలాడుతోందని, తన రాజ‌కీయ ప్రస్థాన‌మంతా తెలుగు ప్రజల అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యంగా సాగిందని అన్నారు. కుట్రల‌తో తనపై అవినీతి ముద్ర వేయాల‌ని ప్రయ‌త్నించారని, తాను న‌మ్మిన విలువ‌లు, విశ్వస‌నీయ‌త‌ను ఎన్నడూ చెరిపేయ‌లేరు. ఈ చీక‌ట్లు తాత్కాలిక‌మినని, సూర్యుడి ముందు కారుమ‌బ్బులు వీడిపోతాయని, సంకెళ్లు తన సంకల్పాన్ని బంధించ లేవని చెప్పారు. జైలు గోడ‌లు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని, జైలు ఊచ‌లు ప్రజ‌ల నుంచి దూరం చేయ‌లేవని అన్నారు.

ఈ దసరాకు పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని రాజ‌మ‌హేంద్రవ‌రం మహానాడులో ప్రకటించానని, అదే రాజ‌మ‌హేంద్రవ‌రం జైలులో తనను ఖైదు చేశారని చెప్పారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుద‌ల చేస్తానని అన్నారు.

This post was last modified on October 23, 2023 12:15 am

Share

Recent Posts

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

24 minutes ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

33 minutes ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

2 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

3 hours ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

4 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

5 hours ago