ఈ వారాంతంలో భారీ హైప్ మధ్య రిలీజైన ‘లియో’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆడియన్స్ సినిమా గురించి ఏదో ఊహించుకుంటే దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇంకేదో చూపించాడు. సినిమా ఆరంభం నుంచి ఇంకేదో ఉంటుంది.. ఇంకేదో ఉంటుంది ప్రేక్షకులు ఎదురు చూడటం.. చివరికి ఏమీ లేకుండానే సినిమా ముగిసిపోవడం జరిగింది. వర్తమానంలో పార్తిబన్ కథ ఎంత సాధారణంగా నడిచినా.. కనీసం ఫ్లాష్ బ్యాక్‌లో అయినా లియో దాస్ పాత్రతో కిక్ ఇస్తారని ఆశిస్తే.. అది కూడా నిరాశ పరుస్తుంది.
లియో పాత్రకు ముందు ఇచ్చిన బిల్డప్‌కు తగ్గట్లుగా ఫ్లాష్ బ్యాక్ లేకపోయింది. నరబలి నేపథ్యంలో నడిచిన ఫ్లాష్ బ్యాక్ తుస్సుమనిపించేసింది. దీనికేనా అంత బిల్డప్ అనిపించింది ఆ ఫ్లాష్ బ్యాక్. ఐతే ఈ ఫ్లాష్ బ్యాక్ విషయంలో ఇప్పుడో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘లియో’కు అదిరిపోయే సినిమాటోగ్రఫీ అందించిన మనోజ్ పరమహంస.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘లియో’ ఫ్లాష్ బ్యాక్ అంతా నిజం అనుకోవడానికి లేదు అని మాట్లాడాడు. అదంతా కూడా అబద్ధం అయ్యుండొచ్చు కదా అని ఆయన వ్యాఖ్యానించాడు.
జైల్లో ఖైదీగా ఉన్న మన్సూర్ అలీ ఖాన్ ఒక కట్టుకథను గౌతమ్ మీనన్‌కు చెప్పి ఉండొచ్చనే అర్థం వచ్చేలా అతను మాట్లాడాడు. అంటే మనం సినిమాలో చూసిందంతా అబద్ధం.. దీనికి కొనసాగింపుగా విజయ్‌తో తర్వాత తీసే సినిమాలో అసలు నిజం చూపిస్తారని ‘లియో’ టీం వర్గాలు అంటున్నాయి. ఐతే అదంతా అబద్ధం అయితే.. ‘లియో’లోనే ఆ విషయం చెప్పకుండా ఇంకో పార్ట్ అనడం విడ్డూరంగా ఉంది. మరి ఈ సినిమా చూసిన జనం పిచ్చోళ్లు అనుకోవాలా? అసలే అది పేలవమైన ఫ్లాష్ బ్యాక్ అంటే.. అదంతా అబద్ధం అని సినిమాలో కాకుండా బయట చెప్పడం అంటే ఆడియన్స్‌ను ఫూల్స్‌ను చేయడం కాక మరేంటి?
This post was last modified on October 22, 2023 4:02 pm
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…