ఈ నెల 24 వరకు చంద్రబాబుకు రిమాండ్

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రిమాండ్ ఈ రోజుతో ముగియబోతున్న సంగతి తెలిసింది. దాంతోపాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఈ రోజే తీర్పు వెలువడనుంది. నిన్న రెండు సార్లు చంద్రబాబు కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా పడింది. తాజాగా, ఈ రోజు ఉదయం 11 గంటలకు తీర్పు వెలువడాల్సి ఉండగా…మరోసారి తీర్పును కోర్టు వాయిదా వేసింది. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు విజయవాడ ఎసిబి కొట్టు న్యాయమూర్తి వాయిదా

దాంతోపాటు, చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


మరోవైపు, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 కు ఏపీ హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడనుంది. ఈ విషయాన్ని చంద్రబాబు తరఫు లాయర్లు కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో కస్టడీ పిటిషన్ తీర్పు మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 26 కు వాయిదా పడిన సంగతి తెలిసిందే.