కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే దఫా ఎన్నికల నిర్వహణ విషయంలో ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా మరోవైపు షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలను ఎదుర్కునే విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందా లేదా వచ్చే ఏడాదికి వాయిదా పడుతుందా అనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ సమయంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమయంలో గా నోటిఫికేషన్ వచ్చేది అనుమానమేనని పేర్కొన్న కేటీఆర్, తెలంగాణ ఎన్నికలు కూడా ఏప్రిల్ మేలో జరగవచ్చునని వెల్లడించారు.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్లో పాత్రికేయులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలపై తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. తెలంగాణలో
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 10లోపు నోటిఫికేషన్ వస్తేనే సమయంలోపు ఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలోగా నోటిఫికేషన్ వచ్చేది అనుమానమేనని కేటీఆర్ అంచనా వేశారు. తెలంగాణ ఎన్నికలు కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో జరగవచ్చునని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ విషయం అనేది పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎన్నికల క్లారిటీ వచ్చి అవకాశం ఉందని జోస్యం చెప్పారు.
ఇక రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి, తమ పార్టీ బలాబలాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణం నెలకొందని తెలిపారు. 90 స్థానాలకు పైగా గెలుస్తామని ప్రకటించిన కేటీఆర్ తమ నాయకుడు కేటీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు. క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ సమాచారం ప్రకారం కేసీఆర్ ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు. పది సంవత్సరాలల్లో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారని ఆయన వెల్లడించారు. కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రజలకు చాలా స్పష్టత ఉందని, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని ఆయన సెటైర్ వేశారు.
తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఇచ్చారని వెల్లడించారు. సిట్టింగులకు సీట్లు ఇవ్వకుంటే తమ దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయని పేర్కొన్న కేటీఆర్ వారి అంచనా తప్పిందని తెలిపారు. ప్రతిపక్షల తాపత్రయం రెండవ స్థానం కోసమేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తమ నాయకుడు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.