జమిలి ఎన్నికలకు సంబంధించిన చర్చ హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల్ని.. లోక్ సభ ఎన్నికల్ని నిర్వహించాలన్న సంగతి తెలిసిందే. అయితే.. మొత్తం రాష్ట్రాల్ని కాకున్నా.. అత్యధిక రాష్ట్రాలను లోక్ సభ ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని నిర్వహించాలని భావిస్తున్న వేళ.. ఇంతకూ దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీ గడువు మాటేమిటి? ఎప్పటివరకు ఆయా రాష్ట్రాల అసెంబ్లీకి గుడువు ఉందన్నది ఆసక్తికరంగా మారింది.
జమిలి ఎన్నికల్ని నిర్వహించాల్సి వస్తే.. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందుకు తీసుకురావటం.. మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని గడువు తీరిన తర్వాత పొడిగించాల్సి ఉంటుంది. ఇంతకీ దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలం ఎప్పటివరకు ఉందన్న విషయాన్ని చూస్తే.. పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. ఈ డిసెంబరు (2023)తో గడువు ముగిసే రాష్ట్ర అసెంబ్లీ జాబితాలో మిజోరం ఒక్కటే ఉంది.
అదే జనవరి 2024 లోపు అసెంబ్లీని కొలువు తీర్చాల్సిన జాబితాలో తెలంగాణ.. ఛత్తీస్ గడ్.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్ లు ఉన్నాయి. జూన్ 2024 నాటికి ఏపీ.. అరుణాచల్ ప్రదేశ్.. ఒడిశా.. సిక్కింలు ఉన్నాయి. నవంబరు 2024 నాటికి హర్యానా.. మహారాష్ట్ర రాష్ట్రాలకు ఎన్నికల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిసెంబరు 2024 నాటికి జార్ఖండ్.. 2025 ఫిబ్రవరి నాటికి ఢిల్లీ.. 20254 నవంబరు నాటికి బిహార్ రాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. 2026 మే నాటికి అసోం.. కేరళ.. తమిళనాడు.. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ గడువు ముగుస్తుండగా.. 2026 జూన్ లో పుదుచ్చేరి గడువు పూర్తి అవుతుంది.
2027 మార్చికి గోవా.. మణిపూర్.. పంజాబ్.. ఉత్తరాఖండ్ అసెంబ్లీకి గడువు పూర్తి కానుండగా.. 2027 మే నాటికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సెంబ్లీ గడువు పూర్తి కానుంది. 2027 డిసెంబరు నాటికి గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్.. 2028 మార్చికి మేఘాలయ.. నాగాలాండ్.. త్రిపుర.. మే 2028 నాటికి కర్నాటక రాష్ట్రాల అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇక.. జమ్ముకశ్మీర్.. లద్దాఖ్ విషయానికి వస్తే.. వీటిని మూడు ముక్కలుగా చేసిన తర్వాత ఇప్పటివరకు ఎలాంటి ఎన్నిల్ని నిర్వహించలేదు.
ఇక.. జమిలి ఎన్నికల్ని నిర్వహించాలంటే రాజ్యాంగంలోని కనీసం ఐదు అధికారణల్ని సవరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ సవరణల కోసమే తాజాగా ప్రత్యేక సమావేశాల్ని నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందోచూడాలి. లోక్ సభలో మోడీ సర్కారుకు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ.. రాజ్యసభలో అంతంతమాత్రంగానే మెజార్టీ ఉన్న వేళలో.. ఇవన్నీ సాధ్యమవుతాయా? అన్నది అసలు ప్రశ్న. మరేం జరుగుతుందో చూడాలి.
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…