విడుదలకు ఆరు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టిన జవాన్ దానికి తగ్గట్టే బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కించుకుంటోంది. నిర్మాణ సంస్థ చాలా తెలివిగా ముందస్తు థియేటర్లని బుక్ చేసుకుని పక్కా ప్లానింగ్ తో అమ్మకాలు చేయడంతో కేవలం ఇరవై నాలుగు గంటలు దాటక ముందే కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇండియా వైడ్ ఇప్పటిదాకా 2 లక్షల 35 వేల టికెట్లు అమ్మేసిన జవాన్ ఆల్రెడీ 8 కోట్ల రూపాయలను ఖాతాలో వేసేసుకుంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఫిగర్లు భారీ ఎత్తున మార్పులు చెంది పఠాన్ ని చాలా సులభంగా దాటేస్తుందని ట్రేడ్ లెక్క వేస్తోంది.
దీన్ని బట్టే షారుఖ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆట్లీ దర్శకత్వం వహించిన జవాన్ కు ట్రైలర్ వచ్చాక అంచనాలు మారిపోయాయి. చాలా గెటప్స్ లో బాద్షా కనిపించడం, ఏదో రెగ్యులర్ యాక్షన్ డ్రామా అనుకుంటే మతిపోయే విజువల్స్ తో షాక్ ఇవ్వడం ఒక్కసారిగా హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. పైగా గత కొన్ని నెలలుగా బాలీవుడ్ లో అధిక శాతం రామ్ కామ్ లే వచ్చాయి. మాస్ జనాల కరువు తీర్చింది ఒక్క గదర్ 2 మాత్రమే. అది కూడా కొన్ని వర్గాలకు పూర్తిగా రీచ్ అవ్వలేదు. కానీ జవాన్ కు ఆ సమస్య లేదు. అందుకే ఈ స్థాయిలో వసూళ్ల ఊచకోత.
తెలుగు తమిళ వెర్షన్లకు సైతం స్పందన బాగుందని బుకింగ్ ట్రెండ్స్ చెబుతున్నాయి. తన మూడు దశాబ్దాల కెరీర్ లో మొదటి సారి షారుఖ్ ఖాన్ జవాన్ కోసం ఖాకీ చొక్కా వేసుకున్నాడు. ఇంతకు ముందు వన్ టూ కా ఫోర్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించినప్పటికీ అందులో యూనిఫామ్ లో ఉండడు. కానీ జవాన్ కి ఎస్ అన్నాడు. ఇదే కాదు ఎన్నడూ లేనిది గుండుతో దర్శనమిచ్చేందుకు సిద్ధ మయ్యాడు. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు ప్రేక్షకులు ఫస్ట్ డేనే చూడాలనుకుంటారు. ముఖ్యంగా మల్టీప్లెక్సుల స్క్రీన్ల టికెట్లకు భారీ ఎత్తున డిమాండ్ ఉంటోంది. మేజర్ రెవిన్యూ వాటి నుంచే వస్తోంది.
This post was last modified on September 2, 2023 10:11 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…