“ఏం సునీతమ్మా.. మీరు కూడా పవన్‌పై వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చారే!” అని పొలిటికల్ అనలిస్టులు పెదవి విరుస్తున్నారు. అంతేకాదు.. ఏ పార్టీ నుంచి ఆఫర్లు వస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేసే ఏకైక మహిళగా గుర్తింపు తెచ్చుకున్న మీరు.. పవన్ గురించి మాట్లాడు నైతిక అర్హత ఉందా? అని ప్రశ్నించారు. ఇంకా.. మీరు పవన్‌ను అనే స్థాయికి ఎదగలేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏం జరిగిందంటే..
పోతుల సునీత. ఈ పేరు కొద్ది మందికే పరచయమైన పేరు. కాపు సామాజిక వర్గానికి చెందిన పోతుల సునీత.. తడవకో పార్టీ మారుతుంటారనే పేరు తెచ్చుకున్నారు. 2014లో టీడీపీ తరఫున చీరాల నుంచి పోటీ చేశారు. అయితే.. స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆమె కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు.. ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు. అయితే.. ఏమాత్రం విశ్వాసం కూడా చూపకుండానే వైసీపీ అధికారంలోకి రాగానే.. ఆమె పార్టీని, జెండాను కూడా మార్చేశారు. దీనికి ముందు ప్రజారాజ్యంలోనూ పనిచేశారు.
అంటే.. మొత్తంగా పోతుల సునీత మూడు పార్టీలు మారి.. పదవులు దక్కించుకున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అలా సునీత.. ఇప్పుడు జనసేన అధినేత పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నాడని, ఆయనను ప్యాకేజీ నాయకుడిగానే ప్రజలు చూస్తున్నారని అన్నారు.
అంతటితో కూడా ఆగకుండా.. పవన్ వ్యక్తిగత జీవితం చూస్తేనే మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తున్నాడో తెలుస్తుందన్నారు. నీ తల్లిని అవమానించిన వారితో ప్యాకేజీ బంధం ఏర్పాటు చేసుకున్నావు, నీ తల్లినే అవమానించావ్ అని పోతుల సునీత ఊగిపోయారు. అయితే.. సునీత చేసిన వ్యాఖ్యలను రాజకీయాలకు అతీతంగా ఉండే.. తటస్థులు గా ఉండే అనలిస్టులు తప్పుబడుతున్నారు. పవన్‌ను విమర్శించే స్థాయికి సునీత ఇంకా ఎదగలేదని.. ఇలాంటి వ్యాఖ్యలతో ఉన్న పరువును పోగొట్టుకోవద్దని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates