జనసేన పార్టీలో 33 శాతం పదవులను మహిళలకే ఇవ్వనున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నా రు. మహిళలకు సమున్నత స్థానం ఇచ్చిన దేశం, పార్టీలు అభివృద్ధి చెందుతున్నాయని వ్యాఖ్యానించా రు. జనసేన మహిళా విభాగం వీర మహిళలతో తాజాగా ఆయన విశాఖ పట్నంలో భేటీ అయ్యారు. దేశ స్వాతం త్య్రోద్యమంలో మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. వీర మహిళలు, ఆడపడుచుల ఆశీస్సులు లేకుండా పార్టీని నడపలేమన్నారు.
పేద, మధ్య తరగతి మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని.. సమాజంలో తమ మేధస్సుతో రాణించా లని కోరుకుంటానని పవన్ తెలిపారు. జనసేనలో వీర మహిళలుగా ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నామ ని చెప్పారు. జనసేన కార్యక్రమాల్లో మూడో వంతు మహిళలు ఉంటారని చెప్పారు. మహిళలకు అండగా ఉండేలా.. అనేక కార్యక్రమాలను గతంలోనే ప్రకటించినట్టు పవన్ తెలిపారు. వచ్చే మేనిఫెస్టోలోనూ.. ఇదే తరహాలో ముందుకు సాగుతామన్నారు.
సీఎంకు సిగ్గుందా?
రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలు అదృశ్యం అవుతున్నారని కేంద్ర ప్రభుత్వం కూడా గగ్గోలు పెడుతోందని.. అయినా.. ఈ ముఖ్యమంత్రికి ఈ విషయంపై దృష్టి పెట్టేందుకు తీరిక లేకుండా పోయిందని పవన్ వ్యాఖ్యానించారు. “వేల మంది మహిళలు అదృశ్యమవుతుంటే.. వారిని గుర్తించాలనే ఇంగితం సిగ్గు కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు“ అని పవన్ అన్నారు. భవిష్యత్తులో జనసేన అధికారంలోకి రాగానే మహిళలకు సరైన స్థానం ఇస్తామన్నారు.
ఏపీలో మహిళలపై దాడులు, దారుణాలు రోజూ జరుగుతున్నాయని పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పెద్దలు, మహిళా కమీషన్ మాట్లాడదని.. దిశ చట్టాలు, స్పందన అంటూ ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ, ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా? అని సీఎంను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates