కాంగ్రెస్‌లోకి క్యూ క‌డుతున్నారే.. జాబితా రెడీ.!

తెలంగాణలో ఎన్నిక‌ల‌కు ముందు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయా? ముఖ్య‌మైన నాయ‌కులు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితిలోనూ టికెట్ పొందాల‌ని భావిస్తున్న నాయ‌కులు.. ఇలా చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నార‌నే చ‌ర్చ కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో ఆయా పార్టీల్లో కొంత మేర‌కు బుజ్జ‌గింపు రాజ‌కీయాలు సాగినా.. ఇవి అంతంత మాత్రంగానే సాగాయి. మ‌రికొన్ని పార్టీలు.. పోతేపోనీ.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.

దీంతో ఇప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ స‌హా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్‌లోకి చేరిక‌లు పెరిగే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ప్ర‌చారం ఇలా జ‌రుగుతున్న క్ర‌మంలోనే తాజాగా ఒక పెద్ద జాబితా సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. రెండు పార్టీలు.. బీజేపీ-బీఆర్ఎస్ ల నుంచి పార్టీ మార‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్న‌వారి జాబితాలో అనేక మంది సీనియ‌ర్లు.. మాజీ మంత్రులు కూడా ఉండ‌డం విశేషం. దీంతోవీరు కాంగ్రెస్‌లోకి వెళ్లే రోజు త్వ‌ర‌లోనే ఉంద‌ని మ‌రింత బ‌లంగా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

బీఆర్ ఎస్ నుంచి జంప్ చేసేవారు..
మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు, దామోదర రెడ్డి ఎమ్మెల్సీ, పాల్వాయి హరీష్ రావు, ఖజిపేట లింగయ్య, తీగ‌ల కృష్ణారెడ్డి(మ‌హేశ్వ రం మాజీ ఎమ్మెల్యే), .సరితా తిరుపతయ్య Z. P. చైర్మన్ గద్వాల.. ఉన్నారు.

బీజేపీ నుంచి జంప్ చేసేవారు..
యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే(మహబూబ్ నగర్) కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే (మునుగోడు), రామారావ్ పటేల్(ముధోల్, ఆదిలాబాద్), రవీంద్ర నాయక్ మాజీ ఎంపీ(మహబూబాబాద్) చంద్రశేఖర్ మాజీ మంత్రి, వికారాబాద్, పవన్ కుమార్ రెడ్డి, దేవరకద్ర, రమేష్ రాథోడ్ మాజీ ఎంపీ(ఆదిలాబాద్), ఏనుగు రవిందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే(ఎల్లారెడ్డి).