వారానికి రెండు సార్లు నవ్వుల విందు చేసే జబర్దస్త్ షోగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటిల్లిపాదీ టీవీలకు అతు క్కుపోయే ఈ ప్రోగ్రామ్ రియాల్టీ షోలను మించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జబర్దస్త్‌షోతో ఏపీ సీఎం జగన్‌ను ముడిపెట్టి కామెడీ పండించారు టీడీపీ సీనియర్ నాయకుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గతంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చేసిన ప్రసంగాన్ని జోడించి.. అదే సమయంలో జబర్దస్త్ యాంకర్ అనసూయ, ఈ షో న్యాయనిర్ణేత రోజాలతో ఒక సీన్‌ను క్రియేట్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
ప్రస్తుతం ఈ జగన్ జబర్దస్త్ క్యామెడీ మామూలుగా లేదుగా! అనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఈ షోలో ఏం చేశారంటే.. దివంగత ముఖ్యమంత్రి, సీఎం జగన్ తండ్రి వైఎస్ జయంతి శనివారం(జూలై 8న) ముగిసింది. అయితే.. గతంలో దీనిపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం జగన్.. ఇదే దివంగత ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు పుట్టిన రోజు నాడు అంటే.. అధ్యక్షా 8 వ తేదీ జూలై 2023న పింఛన్ ను 3000 రూపాయలకు పెంచుతామని మాటిస్తున్నాం అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. మాటిచ్చామంటే.. మాటకు కట్టుబడతాం అధ్యక్షా. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాం అధ్యక్షా అని సీఎం జగన్ అసెంబ్లీలోనే చెప్పారు. అయితే.. ఈ కార్యక్రమం ముగిసింది. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు కూడా అర్పించారు. కానీ, పింఛన్ పెంపు అంశాన్ని ఆయన ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని గోరంట్ల ప్రస్తావిస్తూ.. `ఇదీ బతుకు అనే కామెంట్‌తో జబర్దస్త్ సీన్ క్రియేట్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. జగన్ ఈ కామెంట్లు చేసినప్పుడు.. న్యాయనిర్ణేత స్థానంలో ఉన్న రోజా, యాంకర్ అనసూయ పగలబడి నవ్వడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates