కుక్క తోక తో గోదావరి ఈదుతున్న పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు నుంచి వారాహి యాత్ర రెండో విడతను ఈరోజు ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. తొలి విడత వారాహి యాత్రలో వైసీపీ నేతలు వర్సెస్ పవన్ అన్న రీతిలో మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలోనే రెండో విడత యాత్ర మొదలు కాకముందే పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. తాజాగా పవన్ పై మంత్రి గుడివాడ గుడివాడ అమర్నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ సినిమాలోని హీరో అని రాజకీయాల్లో మాత్రం సైడ్ హీరో అని అమర్నాథ్ పంచులు వేశారు.

ఎన్నికలు జరగకుండానే పవన్ విజయ యాత్ర చేస్తున్నారని, మొన్న పార్ట్-1 జరిగిందని, ఇప్పుడు పార్ట్-2 మొలైందని ఎద్దేవా చేశారు. రాజకీయం అంటే ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ అని పవన్ అనుకుంటున్నారా అని అమర్నాథ్ ప్రశ్నించారు. పవన్ ను హీరోని చేయాలని జనసేన నేతలు, కార్యకర్తలు అనుకుంటున్నారని, కానీ, వేరే సినిమా హీరో పక్కన సైడ్ హీరోలా నిల్చుంటానని పవన్ అంటున్నారని సెటైర్లు వేశారు. అయితే, పక్క సినిమా హీరో చంద్రబాబు…విలన్ అనే మరచిపోయిన పవన్ ఆయన కోసం ఎందుకు తాపత్రయ పడుతున్నారని ప్రశ్నించారు

175 సీట్లలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే జనసేనకు ఏదో ఒక రోజు ప్రజలు అవకాశం ఇవ్వొచ్చని అన్నారు. అలా కాకుండా చంద్రబాబు వెంట ఉంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈడుతున్నట్టే అని ఎద్దేవా చేశారు. చంద్రబాబును భుజాన వేసుకుని తిరగడానికి సొంతగా రాజకీయ పార్టీ దేనికి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 175 స్థానాలు ఎలా గెలవాలి అని తాము ఆలోచిస్తున్నామని, 175 సీట్లలో అభ్యర్థులను ఎలా నిలబెట్టాలి అని పవన్ చంద్రబాబు ఆలోచిస్తున్నారని విమర్శించారు. జనసేన, టీడీపీలు తమకు పోటీ కాదని, ఎన్ని యాత్రలు చేసినా 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు.