జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలపై తరచుగా విమర్శలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల సంగతి తెలిసిందే. సాక్షాత్తూ.. సీఎం జగనే వారాహి యాత్రపై పవన్ ఊగుతాడని.. గంతులేస్తాడని.. తొడలు కొడుతున్నాడని వ్యాఖ్యానించారు. ఇక, అధినేతే.. అలా వ్యాఖ్యానిస్తే.. తాము మాత్రం తక్కువ తిన్నామా.. అంటూ.. ఇతర నాయకులు కూడా ఇదే తరహాలో పవన్‌పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా పవన్ వారాహి యాత్ర, ఆయన సభలకు వస్తున్న జనాలు.. ఆయన ప్రసంగాలపై ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హీరోయిన్ హనీ రోజ్‌తో మీటింగ్ పెడితే.. పవన్ కళ్యాణ్ పెట్టే సభలకు వస్తున్న జనాలకంటే.. కూడా ఎక్కువగానే జనాలు వస్తారని వ్యాఖ్యానించారు. వారాహి యాత్రలకు వస్తున్నవారంతా పవన్‌కు ఓట్లు వేయబోరని వ్యాఖ్యానించారు. కేవలం పవన్ ను చూసేందుకు మాత్రమే జనాలు వస్తున్నారని కేతిరెడ్డి చెప్పారు. వీరి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. అందుకే తాము కూడా చూస్తూ ఊరుకుంటున్నామని తెలిపారు. ఇక, రాజకీయాల్లో ఉన్న వారికి నిలకడ ఉండాలని పవన్ ను ఉద్దేశించి విమర్శించారు.
ఎవరు సొంత పార్టీ పెట్టుకున్నా.. ఈ దేశంలో ప్రజలు స్వాగతిస్తారని కేతిరెడ్డి చెప్పారు. అయితే.. రాజకీయ పార్టీ పెట్టుకున్న వారు.. రాజకీయాల్లో ఉన్నవారు.. తమ గెలుపు కోసం.. తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పనిచేయాలని అన్నారు. కానీ.. పవన్ మాత్రం వేరే పార్టీకి పల్లకీలు మోస్తున్నారని విమర్శించారు. ఇలా చేయడం వల్ల.. మాకేమీ నష్టంలేదని వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సినిమాలు, రాజకీయాలు వేర్వేరని.. సినిమాలు చూసే జనాలు అందరూ.. నటులకు జై కొడితే.. వారే అధికారంలోకి వచ్చేవారు కదా! అని ప్రశ్నించారు. ఇక, టీడీపీ అదినేత చంద్రబాబుపైనా కేతిరెడ్డి విమర్శలు గుప్పించారు. గత ఏడు దఫాల ఎన్నికల్లో ఆయన కుప్పం నుంచి దొంగ ఓట్లతోనే గెలుస్తున్నారని ఆయన ఆరోపించారు.
This post was last modified on June 30, 2023 11:02 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…