జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పరిపాలన భవనాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. ఆదివారం సాయంత్రం వరకు పవన్ కల్యాణ్ అమరావతిలోనే బస చేయనున్నట్లు జనసేన నేతలు వెల్లడించారు. ఈ రెండు రోజులు పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్లు, ప్రైవేట్ మీటింగుల కోసం కేటాయించడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎవరెవరితో భేటీ కానున్నారనే అంశాలపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అయితే పవన్ భేటీ అంశం మా త్రం అటు పార్టీ వర్గాలతో పాటు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పవన్ దూకుడును పెంచాడు. గతం కొంత కాలంగా పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అక్కడి స్థానికులు, నేతలతో భేటీలు నిర్వహిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.
పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చలు చేపడుతున్నారు. అందు కోసమే పవన్ కల్యాణ్ ఆయా వర్గాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కింది స్థాయి కార్యకర్త నుంచి పార్టీలో ముఖ్య నేతల వరకు అందరిని కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరులో వలసలను ప్రోత్సహిం చే విషయంపైనా.. జనసేన దృష్టి పెట్టనుంది. ఇదిలావుంటే, 26న అంటే శుక్రవారం అమరావతిలో జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టనున్న నేపథ్యంలో ఇక్కడ పవన్ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates