క‌ర్ణాట‌క గెల‌వ‌డం.. మోడీకి ఎందుకు ఇంపార్టెంట్‌?

గ‌త ఏడాది గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత ప‌నిచేసింది. వ‌రుస‌గా మ‌రోసారి బీజేపీ అధికార ప‌గ్గాలు చేప‌ట్టారు. అక్క‌డ మోడీ హ‌వానే ఎక్కువ‌గా న‌డిచింది. పేరు, ఊరు కూడా.. ఆయ‌న‌వే క‌నిపించాయి. వినిపించాయి. ఆ త‌ర్వాత‌.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వంటి కీల‌క రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగినా.. అది పెద్ద‌గా లెక్క‌లోకి రాలేదు. ఇక్క‌డ కాంగ్రెస్ ఒకింత బొటాబొటిగానే అధికారం ద‌క్కించుకుంది.

అయితే.. ఇప్పుడు గుజ‌రాత్‌తో స‌రితూగ‌గ‌ల రాష్ట్రం క‌ర్ణాట‌క‌. గుజ‌రాత్‌లో 182 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. క‌ర్ణాట‌క‌లో మ‌రో 42 స్థానాలు అధికంగా ఉన్నాయి. అయితే.. అక్క‌డా ఇక్క‌డా కూడా.. బీజేపీ ప్ర‌భుత్వాలే ఉన్నాయి. అదే స‌మ‌యంలో ప్ర‌ధని మోడీ ఫేసే త‌మ‌ను గెలిపిస్తుంద‌ని..అక్క‌డ భావించిన‌ట్టు గానే క‌ర్ణాట‌క‌లోనూ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మోడీకి క‌ర్ణాట‌క‌ ప్రాధాన్యం పెరిగిపోయింది.

అంతేకాదు.. ద‌క్షిణాది రాష్ట్రాల‌ పై ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రంపై ప‌ట్టు సాధించేందుకు క‌ర్ణాట‌క ఒక గేట్ వే లాంటిదిగా క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పీఎం మోడీకి క‌ర్ణాట‌క రాష్ట్రం ఇంపార్టెంట్‌గా మారింది. పైగా.. పార్ల‌మెంటు స్థానాల‌పైనా.. ఆయ‌న ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. రాష్ట్రంలో 28 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. దీంతో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో(మే 10) మెజారిటీ ఫిగ‌ర్ సాధించే అవ‌కాశం ఉన్న‌పార్టీకి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గెలుపు సులువు అవుతుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల రాష్ట్రాల‌తో పోల్చుకుంటే.. క‌ర్ణాట‌క అందుకే ప్ర‌ధాని మోడీకి ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ నేప‌థ్యంలోనే.. మోడీ ఇంత ప్రతిష్టాత్మ‌కంగా ఇక్క‌డ ప్ర‌చారం చేశార‌నేది ప‌రిశీ ల‌కుల మాట‌. అదేస‌మ‌యంలో 2024 నాటికి దేశ‌వ్యాప్తంగా కాషాయ జెండానే ఎగ‌రాల‌నే సంక‌ల్పం కూడా క‌మ‌ల నాథుల‌ను ముందుండి న‌డిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎలా చూసుకున్నా.. మోడీకి క‌ర్ణాట‌క ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయ‌నేది విశ్లేష‌కుల అంచ‌నా.