ఏడేళ్ల ముందు సంగతి. లోకనాయకుడు కమల్ హాసన్ తన స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో రూపొందించిన ‘విశ్వరూపం’ సినిమాను థియేట్రికల్ రిలీజ్‌తో పాటు డీటీహెచ్‌ల ద్వారా ఇళ్లలోనూ రిలీజ్ చేయాలని చూశారు. తన సినిమా విడుదలకు కొన్ని అడ్డంకులు ఎదురు కావడం, దీంతో పాటు తమిళనాట థియేటర్ల విషయంలో మోనోపలీ నడుస్తుండటంతో దానికి చెక్ పెట్టేందుకు ఈ ఆలోచన చేశారు కమల్. డీటీహెచ్‌లో సినిమా చూసేందుకు నిర్ణీత ధర పెట్టి.. నేరుగా తొలి రోజే టీవీల్లో సినిమా చూసే అవకాశం కల్పించాలనుకున్నారాయన. సినిమాను రికార్డ్ చేసుకునే, పైరసీ చేసే అవకాశం లేకుండా ఏదో ఏర్పాటు చేయాలని కూడా అనుకున్నారు. ఐతే కమల్ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. థియేటర్ల యాజమాన్యాలు ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడంతో కమల్ తన ఆలోచనను ముందుకు తీసుకెళ్లలేకపోయారు.
ఐతే ఆ తర్వాత ఈ తరహా ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. ఐతే కమల్ ఆలోచనను ఇప్పుడు అమల్లో పెట్టడానికి మంచి అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతుండటంతో థియేటర్లు నెల కిందట్నుంచి మూత పడి ఉన్నాయి. లాక్ డౌన్ సడలించినా.. థియేటర్లకు ఇప్పుడిప్పుడే అవకాశం ఇవ్వరంటున్నారు. ఇంకో ఆరు నెలల తర్వాత కానీ థియేటర్లు తెరుచుకోవని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా రిలీజ్ చేసే విషయంలో చర్చలు నడుస్తున్నాయి. కానీ వాటి నుంచి వచ్చే ఆదాయంతో పెట్టుబడి రికవర్ కాదు. ఒకసారి ఓటీటీల్లో రిలీజ్ చేస్తే తర్వాత థియేట్రికల్ రిలీజ్‌కు అవకాశం లేనట్లే. జనాలు థియేటర్లకు రారు. ఈ నేపథ్యంలో డీటీహెచ్‌ల ద్వారా ‘పే పర్ వ్యూ’ తరహాలో ఒక రేటు పెట్టి సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా ఇండస్ట్రీలో నడుస్తోంది. ముందు ఇలా రిలీజ్ చేసి కొంత ఆదాయం రాబట్టుకున్నాక.. ఓటీటీలతో ఒక రేటు మాట్లాడి వాటిలో సినిమాను పెట్టేస్తే పెట్టుబడి రికవర్ చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితుల్ని బట్టి ఈ ఆలోచన అమల్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on April 23, 2020 10:56 pm
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…