2024 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కలిసి పోటీ చేస్తాయా. టీడీపీ అధినేత చంద్రబాబు ఓ మెట్టు దిగి ప్రధాని మోదీతో మాట్లాడతారా.. గతాన్ని మరిచి రాజీకి రెండు పార్టీలు సిద్ధమవుతాయా. చాలా కాలంగా వినిపిస్తున్న ఇలాంటి ప్రశ్నలకు టీడీపీ అధినేత స్వయంగా సమాధానమిచ్చారు. నేరుగా ఆ మాట చెప్పకుండానే పొత్తుకు పచ్చజెండా ఊపారు..
రిపబ్లిక్ టీవీ చర్చావేదికలో మాట్లాడిన చంద్రబాబు, బీజేపీతో పొత్తుకు సిద్ధమన్నట్లుగానే మాట్లాడారు. ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా తన పరిధి మేరకు కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నానని ఆయన చెప్పారు.
ఎన్డీఏకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా..? అనే అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఆసక్తికర సమాధానమే ఇచ్చారు.
నిజానికి ప్రధాని మోదీని చంద్రబాబు ఆకాశానికెత్తేశారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని చేసే పనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పడం ద్వారా మనం మనం ఒకటేనని చంద్రబాబు సందేశమిచ్చారు. అభివృద్ధి విషయంలో ప్రధాని ఏ ఆలోచనతో ఉన్నారో..తాను అదే ధోరణిలో ఆలోచిస్తున్నానని చెప్పారు. ప్రధాని విజనుతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానన్నారు.
దేశానిభివృద్ధి కోసం.. తెలుగువాళ్లం కోసం తన పరిధిలో పనిచేస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. భారతదేశ బలమేంటో.. ప్రధాని మోదీ ప్రపంచానికి చాటి చెబుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా మారిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అప్పట్లో పోరాడిన మాట నిజమేనని అంగీకరించారు. ఏదేమైనా అపోహలు తొలిగిపోయి పొత్తు దిశగా అడుగులు వేస్తున్నందుకు ఇరు పార్టీల కార్యకర్తలు సంతోష పడుతున్నారు.
This post was last modified on April 25, 2023 5:33 pm
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ఎక్కువ ఎడ్జ్ ఉన్నది మెకానిక్ రాకీకే. విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి,…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సుకుమార్ ఏదో…
నిన్న జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకవేళ హైదరాబాద్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ పాట్నాలో వచ్చిన…
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
దర్శక ధీరుడు రాజమౌళి మొదటి నుంచి ఒక సెట్ ఆఫ్ టెక్నీషియన్లతో పని చేస్తూ వచ్చాడు. ఆయన సినిమాలకు ఇప్పటిదాకా…