టాలీవుడ్లో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో రవితేజ ఒకడు. ‘రాజా ది గ్రేట్’కు ముందు మాత్రమే ఆయన కెరీర్లో ఏడాదికి పైగా గ్యాప్ వచ్చింది. దానికి ముందు తర్వాత ఏడాదికి రెండుకు తక్కువ కాకుండా రిలీజ్‌లు ఉండేవి.
గత ఏడాది క్రాక్, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాలతో పలకరించాడు మాస్ రాజా. ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్య, రావణాసుర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావుతో పాటు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు రవితేజ.
దీని తర్వాత రవితేజ చేయబోయే ఓ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. దర్శకుల ట్రాక్ రికార్డు, రేంజ్ చూడకుండా సినిమాలు చేసే రవితేజ.. తన కొత్త సినిమా విషయంలోనూ అలాగే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘కలర్ ఫొటో’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రాజ్‌తో రవితేజ జట్టు కట్టనున్నాడట. ‘కలర్ ఫొటో’ తర్వాత సందీప్ ఏ ఫీచర్ ఫిలిం తీయలేదు. ‘హెడ్స్ అండ్ టేల్స్’ అనే వెబ్ సిరీస్‌కు క్రియేటర్‌గా వ్యవహరించాడు. అలాగే ‘ముఖచిత్రం’ అనే సినిమాకు స్క్రిప్టు అందించాడు.
ఇవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఐతే ఈసారి అతను మాస్ రాజానే మెప్పించే కథ రెడీ చేశాడు. ఈ కథ వైవిధ్యంగా ఉంటూనే రవితేజ మార్కును వినోదానికి ఇందులో ఆస్కారం ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో రవితేజ మిడిలేజ్డ్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడట. మాస్ రాజా లెక్చరర్ అనగానే ‘మిరపకాయ్’ గుర్తుకు వస్తుందనడంలో సందేహం లేదు.
అలాగే ఇది కూడా ఎంటర్టైనింగ్‌గా ఉంటుందని ఆశించవచ్చు. ఈ చిత్రంలో యువ కథానాయకులు చేయగల ప్రత్యేక పాత్రలు కూడా ఉన్నాయట. ఆ పాత్రలకు సిద్ధు జొన్నలగడ్డ, నిఖిల్, శర్వానంద్ లాంటి వాళ్లను కన్సిడర్ చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on April 25, 2023 5:35 pm
ఈ రోజుల్లో ఏదైనా పెద్ద సినిమా మొదట ప్రకటించిన డేటుకు రిలీజైతే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటోంది. ఎంత ప్రణాళికాబద్ధంగా షూటింగ్…
బహుముఖ ప్రజ్ఞాశాలి అడివి శేష్ నుంచి ఒక సినిమా వస్తోందంటే.. ప్రేక్షకుల్లో దానిపై మంచి అంచనాలుంటాయి. ఈ వేసవిలో ‘డెకాయిట్’…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణా అధికార కాంగ్రెస్లో పరిస్థితి నూటెనిమిది డిగ్రీల సెల్సియస్ దాటింది. కొండా సురేఖ…
మంచి సినిమా తీశాం అన్న ధీమా కావచ్చు. లేదంటే సినిమాను ఎలాగోలా జనాల్లోకి తీసుకెళ్లాలి అనే డెస్పరేషన్ కావచ్చు. ఈ…
సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న…
‘ఇరుముడి’ ఇప్పుడు పెద్ద హిట్. రవితేజ మాస్ ఇమేజ్ ఒక వైపు ఉన్నా, సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసింది అందులోని…