Political News

భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్ లో సీబీఐ చెప్పిందేంటి?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని ఆదివారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన్నున్యాయమూర్తి ఎదుట హాజరు పర్చిన వేళ.. సీబీఐ తమ దర్యాప్తులో తేలిన అంశాలు ఇవేనంటూ కోర్టు ముందు పెట్టింది. సీబీఐ అధికారుల కస్టడీ పిటిషన్ లో కీలక అంశాల్ని పేర్కొన్నారు. తమకు భాస్కర్ రెడ్డిని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. ఇంతకూ కస్టడీ పిటిషన్ లో సీబీఐ ఏం చెప్పింది? అన్న విషయాల్లోకి వెళితే..

  • వివేకానంద రెడ్డిపై కడప ఎంపీ అవినాశ్ రెడ్డి.. ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలు ఈర్షగా ఉండేవారు. భాస్కర్ రెడ్డి ఎప్పుడూ వివేకాకు వ్యతిరేకంగా ఉండేవారు. తమ కంటే వివేకాకే ప్రజల్లో మంచి పేరు ఉండేది. వివేకాను వారు శత్రువులగా చూసే వారు.
  • వివేకా నిర్ణయాల్ని విమర్శించే సాహసం మాత్రం చేసేవారు కాదు. భాస్కర్ రెడ్డి.. అవినాశ్ రెడ్డిల ఈర్షకు ఇవన్నీ కారణాలే. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్ రెడ్డి.. భాస్కర్ రెడ్డి.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పని చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత వివేకా ఒక రోజు అవినాశ్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను మీరు మోసం చేశారు. నాకన్ని విషయాలు తెలిశాయి. మీ అందరి కథ చెబుతా అంటూ భాస్కర్ రెడ్డి.. అవినాశ్ రెడ్డి.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో వీరి మధ్య విభేదాలు పెరిగాయి.
  • వివేకా తమకు వార్నింగ్ ఇవ్వటంతో ఆయన్ను హత్య చేయటానికి భాస్కర్ రెడ్డి.. శివశంకర్ రెడ్డిలు కుట్ర పన్నారు. కడప ఎంపీ టికెట్ అవినాశ్ రెడ్డికి కాకుండా షర్మిలకు కానీ విజయమ్మకు కానీ ఎవరికైనా ఒకరికి రావాలని వివేకానంద ఆకాంక్షించేవారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అవినాశ్ రెడ్డి హత్య చేయించి ఉంటారన్న అనుమానం ఉంది.
  • హత్యలో కీలక నిందితుడైన దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పిన అంశాలేమంటే..
  • వివేకా హత్యకు ప్లానింగ్ ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో 2019 ఫిబ్రవరి 10న జరిగింది. ఈ హత్యతో నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. దీని వెనుక వైఎస్ భాస్కర్ రెడ్డి.. అవినాశ్ రెడ్డి.. మనోహర్ రెడ్డి.. శివశంకర్ రెడ్డి లాంటి పెద్దవారు ఉన్నారు.
  • వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. ఇందులో రూ.5 కోట్లు నీకు వాటాగా ఇస్తానంటూ ఎర్ర గంగిరెడ్డి చెప్పారు.
  • వివేకాను చంపాలని చెప్పిన రెండు.. మూడు రోజుల తర్వాత సునీల్ యాదవ్ నాకు రూ.కోటి ఇచ్చారు. ఆ డబ్బులు ఎక్కడివి అంటే.. శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డికి ఇచ్చాడు. ఆయన నాకిస్తే.. నేను నీకిస్తున్నా అని సునీల్ యాదవ్ చెప్పాడు.
  • వివేకాను హత్య చేయాలా? వద్దా? అని సునీల్ యాదవ్ ను సంప్రదించా. నన్ను ఎర్ర గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. ఆయన శివశంకర్ రెడ్డికి ఫోన్ చేశాడు. నాతో మాట్లాడించాడు. ఎర్ర గంగిరెడ్డి ఎలా చెబితే అలా చేయ్. మేం ఉన్నామని చెప్పాం కదా? మళ్లీ అనుమానం ఎందుకు? అని శివశంకర్ రెడ్డి ప్రశ్నించారు.
  • హత్య జరిగిన రోజు ఉదయం 5 గంటల వేళలో నన్ను.. మిగిలిన వారిని గంగిరెడ్డి ఇంటికి పిలిచారు. మీరేమీ భయపడొద్దన్నారు. శివశంకర్ రెడ్డి.. అవినాశ్ రెడ్డిలతో మాట్లాడాను. అంతా వారు చూసుకుంటామని చెప్పారు. మీకు ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులు కూడా ఇచ్చేస్తానని చెప్పారు.

హత్య జరిగిన రోజు ఏమైంది?

  • హత్యకు కొన్ని గంటల ముందు కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్.. పులివెందులలోని వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాశ్ ఇంట్లోనే ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ ద్వారా తేలింది. ఫోరెన్సిక్ విశ్లేషణలోనూ ఇదే విషయం నిర్దారణైంది.
  • వివేకాను చంపేందుకు గొడ్డలి కొనటానికి కదిరి వెళ్లిన దస్తగిరి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు పులివెందులకు చేరుకున్నాడు. అప్పటికే అతని కోసం ఎదురుచూస్తున్న సునీల్ యాదవ్ కలిశాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం వైఎస్ భాస్కర్ రెడ్డి తన రెండు ఫోన్లను ఆఫ్ చేశారు.
  • సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి.. దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి కలిసి వివేకాను గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు. హత్య జరిగిన రోజున సునీల్ యాదవ్ పలుమార్లు భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ఇంటికి పదే పదే తిరిగారు.

హత్య తర్వాతేమైంది?

  • హత్య తర్వాత నిందితులు (శివశంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి) భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ఇంటి వద్దే ఉన్నారు. వేరే వ్యక్తుల ద్వారా వివేకా మరణం గురించి సమాచారం తెలుసుకోవలని.. ఆ తర్వాత అక్కడకు చేరుకోవటానికి వీలుగా వెయిట్ చేశారు.
  • మరణ వార్త అందుకున్నంతనే ఆధారాలు.. సాక్ష్యాలు ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. వివేకా మరణించారని.. ఆయన పీఏ క్రిష్ణారెడ్డి చెప్పగానే.. అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఇతర సన్నిహితులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పుడే భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తదితరులు అక్కడకు చేరుకున్నారు.
  • హత్య చేసి గుండెపోటుగా ప్రచారం చేయటం.. రక్తపు మరకల్ని చెరిపేయటం.. డెడ్ బాడీ మీద ఉన్న గాయాలకు బ్యాండేజీ కట్టటం.. ఫ్రీజర్ బాక్సును తెప్పించటం..ప్రజలు చూసేందుకు పూలతో అలంకరించటం.. లాంటివి హత్య కుట్రను దాచేందుకే జరిగాయి.
  • కేసును గుండెపోటు మరణంగా మేనేజ్ చేయాలని ఇన్ స్పెక్టర్ శంకరయ్యను బెదిరించారు. వివేకాది గుండెపోటు మరణంగా ప్రజల్నినమ్మించేందుకు భాస్కర్ రెడ్డితో పాటు అతడి అనుచరులు ప్రయత్నించారు.
  • వివేకా హత్యను సహజ మరణంగా చూపించాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఘటనా స్థలంలో ఆధారాల్ని ధ్వంసం చేశారు. ఈ ప్రక్రియ మొత్తం వైఎస్ భాస్కర్ రెడ్డి.. అవినాశ్ రెడ్డిల డైరెక్షన్ లోనే జరిగింది. ఆధారాల్ని ధ్వంసం చేసే సమయంలో ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు భాస్కర్ రెడ్డి లోపలి నుంచి తలుపులు వేశారు.
  • తలుపు వద్దే ఉన్న భాస్కర్రెడ్డి.. రక్తం మరకల్ని శుభ్రం చేయించారు. గాయాలకు కట్లు.. బ్యాండేజీలు వేసే సిబ్బందిని మాత్రమే అనుమతించారు. ఆ టైంలో అవినాశ్ రెడ్డి రెండు.. మూడుసార్లు లోపలకు వెళ్లి బయటకు వచ్చారు. గాయాలు బయటకు కనిపించకుండా ఉండేందుకు డెడ్ బాడీ చుట్టూ బ్యాండేజీలతో కట్టుకట్టారు. ఫ్రీజర్ లో ఉంచి పూలతో అలంకరించారు. ఆ తర్వాత డెడ్ బాడీని ఆసుపత్రికి పంపారు. ఇవన్నీ హత్య కుట్రను దాచటానికే చేసిన ప్రయత్నాలే.

This post was last modified on April 17, 2023 1:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

7 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

9 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

9 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

10 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

11 hours ago