Movie News

బన్నీ ఆలస్యంగా చెప్పినా మంచిదే

బాక్సాఫీస్ వద్ద దసరా బ్లాక్ బస్టర్ రన్ మూడో వారంలోనూ కొనసాగుతోంది. దీని తర్వాత ఒక్కటంటే ఒక్కటి సరైన మాస్ సినిమా రాకపోవడంతో నాని పంట మాములుగా పండలేదు. ఇరవై రోజులకు దగ్గరగా ఉన్నా చాలా చోట్ల వసూళ్లు స్టడీగా ఉన్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్పందన ట్విట్టర్ లో చెప్పాడు. అద్భుతంగా ఉందని, నాని కీర్తి సురేష్ ల నటనతో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇతర సాంకేతిక వర్గం పనితనం గొప్పగా ఆవిష్కరింపబడిందని ప్రశంసించాడు. నాలుగో వారంలో అడుగు పెట్టబోతున్న దసరా బృందానికి ఇది జోష్ ఇచ్చేదే.

బాగానే ఉంది కానీ ఈ శుభాకాంక్షలేవో కాస్త ముందు చెప్పి ఉంటే కలెక్షన్లకు ఉపయోగపడేదని నాని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మొన్న వచ్చిన శాకుంతలం డిజాస్టర్ అయ్యింది. విడుదల పార్ట్ 1కు ప్రశంసలు వచ్చాయి కానీ ఆ మోతాదులో వసూళ్లు లేవు. రుద్రుడు ఫస్ట్ షోకే వాషౌట్ అని క్లారిటీ వచ్చింది. సో ఆడియన్స్ కున్న ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ దసరా మాత్రమే. కాబట్టి ఈ టైంలో బన్నీ విషెస్ ఖచ్చితంగా ప్లస్ అయ్యేవే. తిరిగి 21 శుక్రవారం విరూపాక్ష, కిసీకా భాయ్ కిసీకా జాన్ వచ్చే దాకా ఇదే రన్ కొనసాగే అవకాశాలున్నాయి. కాబట్టి నో టెన్షన్.

దసరా తొలుత ఏపి నెమ్మదించిందనే వార్తలు వచ్చినప్పటికీ క్రమంగా ఇప్పుడు అక్కడా పికప్ కనిపిస్తోంది. కొత్తగా మళ్ళీ ఈవెంట్లు చేసే ఆలోచన లేకపోయినా జరుగుతున్న పరిణామాలు చూసి మరో వేడుక చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో టీమ్ ఉన్నట్టుగా సమాచారం. ఫ్రైడే రిలీజుల ఫలితాలు చూశాక అప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు. పుష్ప 2 ది రూల్ షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ కాస్త బ్రేక్ దొరికాక దసరా చూశాడట. ఇందులో సుకుమార్ రికమండేషన్ ఉందని వినికిడి. మొత్తానికి సెలబ్రిటీలతోనూ శభాష్ అనిపించుకుంటున్న దసరా ఫైనల్ ఫిగర్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

This post was last modified on April 17, 2023 2:25 pm

Share

Recent Posts

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

26 minutes ago

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

42 minutes ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

2 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

6 hours ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

7 hours ago