బీజేపీ ముఖ్య నేత, మోడీ తర్వాత నాయకుడు అయిన అమిత్ షాకు కరోనా సోకింది. కొద్దిగా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్టు చేయించుకోగా… పాజిటివ్ అని తేలినట్లు ఆయన స్వయంగా ట్విట్టరు ద్వారా తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నా కూడా వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉండగా మరో మూడు రోజుల్లో అయోధ్య రామాలయానికి శంకుస్థాపన, భూమిపూజ జరగనున్న నేపథ్యంలో అతిథుల్లో ఒకరైన అమిత్ షాకు కరోనా సోకడం గమనార్హం. ఆగస్టు 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరగనుంది. తాజాగా కరోనా అని తేలడంతో అమిత్ షా ఇక ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదు.
గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోమని అమిత్ షా సూచించారు. ఫలితాలు వెల్లడయ్యే వరకు ఐసోలేషన్లో ఉండమని ఆయన కోరారు. హోం శాఖ మంత్రిగానే కాకుండా పార్టీ పరంగా కాకుండా అమిత్ షా కీలక వ్యక్తి.
ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కమల్ రాణి వరుణ్ కొద్దిరోజులుగా కరోనా సోకి చికిత్స పొందుతూ ఉన్నారు. ఆమె ఈరోజు ఉదయం మరణించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates