ఏపీ అధికార పార్టీ వైసీపీ తరఫున ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బొమ్మి ఇజ్రాయెల్ చిందేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన తొలిసారి సొంత జిల్లా అమలాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక వైసీపీ కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున సన్మానం చేశారు. అయితే.. ఈ సభలో రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఇక, ఈ డ్యాన్స్‌లోపాల్గొన్న యువతులతో ఎమ్మెల్సీ.. ఇజ్రాయెల్ చిందులేశారు. యువతుల చేతులు పట్టుకుని.. వారితో స్టెప్పులు వేశారు. వీటిని చూసిన వారు ఆశ్చర్యపోయారు. ప్రజలకు సేవ చేస్తారని అనుకుంటే.. ఇలా డ్యాన్సులు చేయడమేంటని వారిలో వారు ప్రశ్నించుకున్నారు.
ఇక, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన బొమ్మి ఇజ్రాయేల్ శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఇటీవల ఎన్నికయ్యారు. గ్రామ ఉపసర్పంచ్ నుంచి శాసన మండలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొమ్మి ఇజ్రాయేల్ ఎదిగారు. మాదిగ దండోరా ఉద్యమ సమయం నుంచి యాక్టివ్‌గా రాజకీయాల్లో ఉన్న ఇజ్రాయేల్.. అంబేడ్కర్ ఆర్గనైజేషన్లలోనూ పనిచేశారు. ఇజ్రాయేల్ స్వస్థలం అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండలం గోడి గ్రామం.
గతంలో గోడి గ్రామ ఉపసర్పంచ్‌గా పనిచేసిన ఇజ్రాయేల్.. వైసీపీ పార్టీలో పలు పదవుల్లో పనిచేశారు. స్థానికంగా మంత్రి విశ్వరూప్‌కు ముఖ్య అనుచరునిగా ఆయన ఉన్నారు. 1995లో ఎస్కేబీఆర్ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌కు అధ్యక్షునిగా ఇజ్రాయేల్ పనిచేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరొందారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి వైసీపీలో ఎదిగిన ఇజ్రాయెల్.. ఇలా చిందులేయడం.. పట్ల స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on April 5, 2023 6:40 am
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…