ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగం పుంజుకున్నాయి. సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతల మీటింగ్ పెట్టిన రోజే జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉన్నారు.ఇప్పుడాయన మోదీ, అమిత్ షా అప్పాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారు. బీజేపీ అగ్రనేతల పిలుపు మేరకే పవర్ స్టార్ ఢిల్లీ వెళ్లినట్లు తెలిసింది..
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ ప్రకటించి చాలా రోజురైంది. కాకపోతే ఆయన అడిగిన రోడ్ మ్యాప్ కు బీజేపీ నేతలు ఇంకా స్పందించలేదు. దానిపై చర్చించేందుకే పవన్ ను ఢిల్లీ పిలిపించి ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది..
ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. అండమాన్ లో బీజేపీ, టీడీపీ దోస్తీపై ట్వీట్ చేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తమ మనసులో మాటను చెప్పకనే చెప్పారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా నడ్డా శుభాకాంక్షలు తెలియజేశారు. దానితో స్నేహం కోసం బీజేపీ సిద్దమవుతున్నట్లు భావిస్తున్నారు. అయితే అంతకు మించి ఏదో జరుగుతోందన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏదేమైనా పవన్ కు బీజేపీ పెద్దల అప్పాయింట్మెంట్ ఇచ్చి వారితో మాట్లాడిన తర్వాతే అసలు సంగతి తెలుస్తోంది..
Gulte Telugu Telugu Political and Movie News Updates