ఏపీ సీఎం జగన్ ఇన్నాళ్లుగా పెంచి పోషించిన మొక్కను తన చేతతో తానే తెంపేసుకుంటున్నారా? ఆయన ఇప్పటి వరకు ఏ విషయంపై అయితే.. అత్యంత శ్రద్ధ వహించారో.. ఇప్పుడు అదే విషయంపై అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎన్నడూ లేని విధంగా ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీలకు కూడా అంతే ప్రాధాన్యం కల్పించారు.
ఇది సీఎం జగన్‌ను ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది. ఆయా సామాజిక వర్గాలకు.. గతంలో వైఎస్ హయాం నుంచి కూడా.. అండగా ఉంటున్నారనే పేరు ఉండడంతో అది ఇప్పుడు జగన్ కూడా కొనసాగించ డంతో ఎస్సీ, ఎస్టీ వర్గాలు.. 2014, 2019 ఎన్నికల నుంచి జగన్‌వెంటే నడుస్తున్నాయి. గత ఎన్నికల్లో మొత్తం ఎస్టీ నియోజకవర్గాలు.. ఒక్క ఎస్సీ నియోజకవర్గం తప్ప.. అన్ని చోటా వైసీపీ విజయం దక్కించు కుందంటే.. అది ఖచ్చితంగా ఆయా వర్గాలు.. సీఎం జగన్ వెనుక ఉన్నాయని ప్రత్యక్షంగా చెప్పడమే.
అయితే.. అలాంటి వర్గాలు ఇప్పుడు.. కీలక ఎన్నికల సమయంలో వైసీపీకిదూరం కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. తేనె తుట్టె వంటి.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని.. సీఎం జగన్ కదపడం.. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగడం తెలిసిందే. బోయలను.. ఎస్టీల్లో చేర్చాలని, వడ్డెర లను ఎస్సీల్లో చేర్చాలని అదేవిధంగా దళిత క్రిస్టియన్లను కూడా ఎస్సీ సామాజిక వర్గంలో ప్రాధాన్యం కల్పించాలని ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేశారు.
అయితే..ఆయా వర్గాలకు చెందిన వారు మాత్రం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను కదపడానికి వీల్లేదని తేల్చి చెబుతున్నారు. ఇది.. తీవ్ర ఉద్యమంగా మారే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇప్ప టి వరకు జగన్ ప్రభుత్వం ఎన్ని చేసినా.. ఇప్పుడు కీలక ఎన్నికల సమయంలో తేనెతుట్టె వంటి.. రిజర్వే షన్ విషయాన్ని కదపడం వల్ల.. మేలు కన్నా.. కీడే ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates