మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా తేలిపోయింది. దానికి తగ్గట్టుగా రెండు మూడు రోజులుగా కన్నా..సత్తెనపల్లిలో తిరుగుతూ టీడీపీ నేతలందరినీ పలుకరిస్తున్నారు. పొరుగున ఉన్న పెద కూరపాడు నియోజకవర్గానికి తాను ప్రాతినిధ్యం వహించినప్పుడు సత్తెనపల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు…
కన్నా రాకతో సత్తెనపల్లి టీడీపీలో టికెట్లు ఆశిస్తున్న వారంతా ఇప్పుడు సైడైపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం ముగ్గురు నలుగురు ఆశావహులు అక్కడ క్రియాశీలంగా ఉంటూ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు యువనేతలను నారా లోకేష్ బుజ్జగించి ఎన్నికల తర్వాత తగిన రీతిలో అవకాశాలిస్తామని చెప్పారట. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కూడా కొంతకాలంగా సత్తెనపల్లిలో తిరుగుతూ అందరనీ కలుస్తున్నారు. ఒక అన్న క్యాంటిన్ ప్రారంభించి రోజూ 200 మందికి భోజనం పెడుతున్నారు. వైవీ ఆంజనేయులు ఇప్పుడు పునరాలోచనలో పడిపోయారు..
కోడెల శివరాం పరిస్థితి ఆగమ్యగోచరం
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. తండ్రి మరణం తర్వాత ఆయన టీడీపీ టికెట్ ఆశించారు. నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని ఎదురు చూశారు. అయితే 2014 నుంచి 2019 మధ్య నియోజకవర్గంలో శివరాం అరాచకాలను చూసిన చంద్రబాబు ఆయన్ను దూరం పెట్టారు. ఇటీవలే శివరాం ఆయన్ను కలవడంతో ముందు పార్టీలో పనిచేయాలని, తర్వాతే టికెట్ గురించి ఆలోచించాలని చెప్పి పంపారు. ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేమని కూడా ప్రకటించారు. కోడెలను లోకేష్ కూడా దూరం పెట్టారు. దానితో ఇప్పుడు కన్నా వస్తున్న తరుణంలో ఇక శివరాం ఖేల్ ఖతం అన్న వాదన వినిపిస్తోంది. వృత్తి రీత్యా కేన్సర్ వైద్యుడైన శివరాం.. తండ్రి మరణించిన తర్వాత ఫుల్ టైమ్ పార్టీపైనే దృష్టి పెట్టారు. కాకపోతే నిజంగా రాజకీయాల్లో కొనసాగాలంటే మాత్రం శివరాం మరో ఐదేళ్లు ఆగాల్సి ఉంటుంది..
సహకరిస్తారా… లేదా..
ముందు నుంచి టీడీపీలో క్రియాశీలంగా ఉంటున్న ఆశావహులంతా కన్నాకు సహకరిస్తారో లేదో చూడాలి. ఎందుకంటే పార్టీకి విజయవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు ఎమ్మెల్యే పదవిని ఆశిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మరోసారి అవకాశం రాదన్న భయం వారిలో ఉందనే చెప్పాలి. పైగా ఇప్పటిదాకా వాళ్లు విపరీతంగా ఖర్చు పెట్టి కూడా ఉన్నారు…
This post was last modified on February 21, 2023 7:59 pm
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…