ఒకప్పటి సినీ హాస్య నటుడు.. ‘పాయే’ డైలాగుతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బాబూమోహన్.. తర్వాత.. రాజకీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన వివాదంలో చిక్కుకుపోయారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న బాబూమోహన్.. పార్టీ సొంత కార్యకర్తపై బాడకావ్.. సహా మరికొన్ని పరుష పదాలు.. నా కొడక.. అంటూ.. విరుచుకుపడ్డారు. అదేసమయంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌పైనా విరుచుకుపడ్డారు.
బండి సంజయ్ ఎవడ్రా.. నువ్వెంత ? నీ బతుకెంత? అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందోల్ నియోజకవర్గం నుంచి గతంలో విజయం దక్కించుకున్న బాబూ మోహన్ టీడీపీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. గత 2018 ఎన్నికల్లో పట్టుబట్టి టికెట్ దక్కించుకున్నా.. గెలుపుగుర్రం ఎక్కలేక పోయారు. తర్వాత.. అనూహ్యంగా ఆయన బీజేపీ పార్టీలోకి చేరిపోయారు.
అయితే.. కొన్నాళ్లుగా పార్టీలో ఆయన యాక్టివ్‌గా లేరు. దీనికి పార్టీ నేతలే కారణమనే గుస్సా ఆయనలో ఉంది. ఈ క్రమంలో తాజాగా ఇదే నియోజకవర్గంలోని జోగిపేట బీజేపీ కార్యకర్త.. వెంకటరమణపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం.. తీవ్ర వ్యాఖ్యలు విసరడం. వంటివి చర్చకు దారితీశాయి.
“నువ్వెంత, నీ బతుకెంత.. నీకు 41. అంటే.. నా అనుభవం అంత లేదు నీ వయసు. నీకు ఎంత ఓటు బ్యాంకు ఉంది. 2 వేలా.. నువ్వొక బచ్చావి. నువ్వు గల్లి లీడర్.. నేను రాష్ట్ర నాయకుడిని ప్రపంచ నాయకుడిని.. మన ఇద్దరి ఓటు బ్యాంక్ ఎంతో చూసుకుందాం. నువ్వు ఫోన్ రికార్డు చేసి.. బయటకు ఇవ్వాలని చూస్తున్నావ్. భయపడేదిలేదు. ఇచ్చుకో. నువ్వు నాకు ఫోన్ చేయకు. ఇంకో సారి ఫోన్ చేస్తే.. జోగిపేటలోనే చెప్పుతో కొడతా.. నా కొడక. ఎవడ్రా బండి సంజయ్.. ” అంటూ కార్యకర్త వెంకటరమణపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates