ఏపీ అధికారపక్షానికి టైం బాగున్నట్లుగా లేదు. వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే రెండు షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది.
తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఒక దళిత యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శిరోముండనం చేసిన తీరు సంచలనంగా మారింది. దీనిపై విపక్షాలు మొదలు దళిత నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
చివరకు సీఎం జగన్ సైతం స్పందించి.. సీరియస్ అయ్యారు. బాధ్యులైన పోలీసులపై చర్యలకు ఆదేశించారు. ఇదిలా ఉంటే ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. పార్టీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ గా తేలినట్లుగా తెలుస్తోంది.
ఏపీ అధికార పక్షానికి చెందిన పలువురు నేతలకు ఇప్పటికే పాజిటివ్ తేలగా.. జగన్ కు.. విజయసాయికి సన్నిహితంగా ఉండే అంబటికి పాజిటివ్ కావటంతో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరింత జాగ్రత్తగా ఉండాలని కోరుకుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates