తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన యువశక్తి సభలో ఆయన చేసిన డైలాగులు.. పేల్చిన పంచ్‌లు జోరుగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సంబరాల రాంబాబు డైలాగును వైసీపీ నాయకులు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. ఆయా డైలాగులకు సంబంధించిన వీడియోలు ముక్కలు ముక్కలుగా టీడీపీ నేతలే వైరల్ చేస్తుండడం గమనార్హం.
ఈ వీడియోల్లో సీఎం జగన్ నుంచి మంత్రులు గుడివాడ అమర్నాథ్, రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, సలహాదారు రామకృష్నారెడ్డి వంటివారిపై పవన్ పేల్చిన పంచ్‌లు ఉన్నాయి. ఇవి యువత నోటిలో నానుతున్నాయి. ఇవి కనుక ప్రజల్లోకి వెళ్తే.. తమకు ఇబ్బంది తప్పదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. పవన్ చేసిన వ్యాఖ్యల్లో ఎక్కువగా మూడుముక్కల జగన్ ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది.
అదే సమయంలో సంబరాల రాంబాబు కూడా వైరల్‌గా మారింది. ఇక, సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి.. డంకాపలాస్ అని వ్యాఖ్యానించారు. ఇది పెద్దగా వైరల్ కాకపోయినా.. ఇతర వ్యాఖ్యలు మాత్రం జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇక, మంత్రి రోజాను ఉద్దేశించి డైమండ్ రాణి అని వేసిన పంచ్ కూడా సీమ ప్రాంతంలో జోరుగా వైరల్ అవుతోంది. గుడివాడ నానిని ఉద్దేశించి పులి-మేక, గుడివాడ అమర్నాథ్ ,పేర్ని నానిలను ఉద్దేశించి వందిమాగధులు అంటూ..పవన్ పంచ్‌లే శారు.
ఇప్పుడు ఇవన్నీ.. కూడా జోరుగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్, రోజా, అంబటిపై పేల్చిన పంచ్‌లకు కౌంటర్ పంచ్‌లు వేయాలని.. పార్టీ అదిష్టానం నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది. మరి మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates