ఏ ముహూర్తాన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను కాస్తా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చాడో కానీ.. ఈ మార్పు వల్ల ఆయన కొత్తగా ఏం సాధిస్తున్నది లేకపోగా.. పార్టీకి ఎక్కువ డ్యామేజే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పుట్టిందే విభజన రాజకీయం మీద. అలాంటిది దేశం మొత్తాన్ని కలుపుకుపోతాం.. ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తాం అంటుంటే జనాలకు కామెడీగా అనిపిస్తోంది.
ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏదైనా కార్యక్రమాలు చేయబోతుంటే… ఎన్నికల్లో పోటీ పడుతుంటే.. ఆంధ్రా పార్టీకి ఇక్కడేం పని? మిమ్మల్ని ఇక్కడ్నుంచి తరిమేశాం కదా అంటూ దారుణంగా మాట్లాడేవాళ్లు టీఆర్ఎస్ పార్టీ వాళ్లు. కానీ ఈ మధ్య ఖమ్మంలో భారీ సభ పెట్టి తిరిగి తెలంగాణ రాజకీయాల్లో టీడీపీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు చేస్తే.. టీఆర్ఎస్ వైపు నుంచి బలమైన వాయిస్ లేకపోయింది.
ఓవైపు బీఆర్ఎస్‌ను ఏపీతో పాటు దేశమంతా విస్తరిస్తామని.. అందరినీ కలుపుకుని వెళ్తామని అంటూ.. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి రావడాన్ని వ్యతిరేకించలేరు కాబట్టి.. సైలెంటుగా ఉండాల్సి వచ్చింది. ఇక తాజాగా ఏపీలో రావెల కిషోర్, తోట చంద్రశేఖర్ లాంటి జనబలం లేని, ఔట్ డేటెడ్ రాజకీయ నేతల్ని బీఆర్ఎస్‌లో చేర్చుకుని.. ఏపీలో అధికారంలోకి వచ్చేస్తాం.. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేస్తాం అని అంటుంటే వినడానికి మరింత కామెడీగా అనిపిస్తోంది. నిన్న ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి కేసీఆర్ మీద సోషల్ మీడియా ట్రోలింగ్ మామూలుగా జరగట్లేదు.
ఆంధ్రా బిరియానీని పేడ బిరియానీ అని వ్యాఖ్యానించడమే కాక ఆ ప్రాంతం మీద తీవ్ర స్థాయిలో విద్వేషాన్ని చిమ్ముతూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలన్నీ బయటికి తీస్తున్నారు. ఇన్ని మాటలు అని ఇప్పుడు ఏపీలో మీ రాజకీయం ఏంటి అంటూ కేసీఆర్‌ను నిలదీస్తన్నారు. టీఆర్ఎస్ అనే పేరుతో పార్టీ ఉన్నంత వరకు తెలంగాణ సెంటిమెంట్ దానికి ఎటాచ్ అయి ఉండేది. అవసరమైనపుడు సెంటిమెంటను రగల్చడానికి అది ఉపయోగపడేది. కానీ బీఆర్ఎస్‌గా పేరు మారడంతో ఇక ఆ అవకాశం కోల్పోయినట్లే. మొత్తంగా చూస్తే ట్రోల్స్ ఎదుర్కోవడానికి తప్ప బీఆర్ఎస్ పెట్టి కేసీఆర్ ఏం సాధిస్తున్నాడో అర్థం కాని పరిస్థితి.
This post was last modified on January 4, 2023 7:22 am
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…