ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అభిమానుల నుంచే కాదు.. వృద్ధులు, మహిళల నుంచి కూడా అపూర్వమైన స్వాగతం లభించింది.
పవన్ ను చూసేందుకు మాత్రమే కాదు.. ఆయన చెప్పేది వినేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు పోటెత్తారు. ఒక వృద్ధురాలు..ఏకంగా బారికేడ్‌ను దాటుకుని.. జనసేనానిని చూసేందుకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.
ఈల వేసి.. గోల చేస్తూ..పవన్‌కు జేజేలు పలుకుతున్న వైనం అందరినీ ఆకట్టుకుంది. ఇక, జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అయితే దీనికి ముందుగా దారిలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పవన్కు ఘన స్వాగతం పలికారు.
మేడి కొండూరు మండలం పేరేచర్ల జంక్షన్లో, కొర్రపాడులో దారిపొడవునా జన సైనికులు స్వాగతం పలికారు. అక్కడ పవన్ను గజమాలతో సత్కరించారు. పవన్ కల్యాణ్ను చూసేందుకు మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలిరాగా అభిమానులకు నమస్కారం చేస్తూ పవన్ ముందుకు సాగారు.
సభకు కూడా ఊహించని విధంగా అభిమానులు పోటెత్తారు. జిల్లా నుంచే కాకుండా.. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. పవన్ హాట్ కామెంట్లుచేసిన ప్రతిసారీ.. చప్పట్లు ఈలలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates