తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. నియోజకవర్గాల సమీక్షలో భాగంగా.. లోకేష్ తో చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గంపై చర్చించారు. సాధారణంగా.. నారా లోకేష్ దూకుడు, నియోజకవర్గంలో ఆయన చేపడుతున్న కార్యక్రమాలు మీడియాలో జొరుగానే ప్రచారం జరుగుతున్నాయి. వీటిని బట్టి.. ఎవరైనా..లోకేష్ దూకుడు సూపరెహే! అనే అనుకుంటారు. కానీ, చంద్రబాబు చేయించి న లేటెస్ట్ సర్వేలో మాత్రం.. లోకేష్‌కు తక్కువ మార్కులు వచ్చాయని తెలిసింది. దీంతో తాజాగా నిర్వహించిన సమీక్షలో లోకేష్‌కు నేరుగా క్లాస్ ఇచ్చిన ట్టు తెలుస్తోంది.
వాస్తవానికి.. గత ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కుతాడని.. లోకేష్‌పై టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. నందమూరి కుటుంబంలో కానీ… నారా కుటుం బంలోకానీ.. తొలిసారి పోటీ చేసిన వారు ఓడిపోవడం అనేది.. లేదు. ఏదైనా.. తీవ్రమైన రాజకీయ సమరం వస్తే.. తప్ప. అది కూడా.. ఎంతో కీలక సమయంలోనే. అయితే.. ఇప్పుడు.. ఎలాంటి కీలక సందర్భం లేకుండానే.. నారా లోకేష్ మంగళగిరిలో పరాజయం పాలయ్యారనేది.. ఒక చర్చ. అది కూడా .. గతంలో కంటే.. ఏకంగా వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ నాయకుడు విజయం దక్కించుకోవడం కూడా.. చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిణామాలతోనే ఇక్కడ పార్టీ పుంజుకోవాలని.. ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఎన్నికల్లో లోకేష్ గెలిచి తీరాలని.. చంద్రబాబు సంకల్పం చెప్పుకొన్నారు. దీనికి తగినట్టుగానే.. చంద్రబాబు అడుగులు ముందుకు వేస్తున్నారు. కనీసం.. నెలకు రెండు సార్లు.. నియోజకవర్గంలో లోకేష్ పర్యటించేలా ప్లాన్ చేసు కున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా.. ఉన్న వృత్తి దారులకు.. వివిధ వస్తువులు.. బండ్లు అందిస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. వారు చెబుతున్న సమస్యలను కూడా.. నోట్ చేసుకుంటున్నారు. అయితే.. ఇప్పటి వరకు.. ఆశించిన మేరకు మార్కులు పడలేదని.. అంటున్నారు పరిశీలకులు.
ఇదే విషయాన్ని చంద్రబాబు తాజాగా చేయించిన సర్వేలోనూ తేలిందని చెబుతున్నారు. లోకేష్.. వస్తే.. ప్రజలు వస్తున్నారు. ఆయనకు సమస్యలు చెబుతున్నారు. కానీ, ఆయా సమస్యలను సమస్యలుగా చూడకుండా.. దీనిని కూడా.. రాజకీయం చేయడం.. ప్రజల దగ్గరే దీనిపై విమర్శలు చేయడం.. వంటివి లోకేష్‌కు మైనస్ గా మారుతున్నాయని అంటున్నారు. నిజానికి ప్రజలు తమ సమస్యలు చెప్పినప్పుడు.. వాటిని రాజకీయ కోణంలో చూడకుండా.. వారికి కొంత భరోసా కల్పించేలా చూడాలి. అయితే.. ఈ విషయంలో లోకేష్ చెబుతున్న మాటలు రాజకీయ కోణంలోనే ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మార్కులు ఆశించినంతగా పడలేదనే టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా.. మారి.. మంచి మార్కులదిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.
This post was last modified on October 29, 2022 11:08 am
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…
ప్రస్తుతం దేశమంతా ‘పుష్ప’ కార్చిచ్చు వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెటర్లు మొదలు పొలిటిషియన్ల వరకు ‘పుష్ప’గాడి ఫైర్ కు ఫిదా…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్…
అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలు మ్రోగనున్నాయి. డిసెంబర్ 4 అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఏఎన్ఆర్ విగ్రహం…