ఎమ్మెల్యే అంటే.. ఎలా ఉండాలి? ప్రజలకు అంతో ఇంతో సేవ చేసేలా ఉండాలి. పోనీ.. చేయకపోయినా.. వారు ఓట్లు వేసి గెలిపించినందుకైనా వారి పట్లకనీసం మర్యాదగా ప్రవర్తించాలి. కానీ, ఇటీవల కాలంలో కొందరు ఎమ్మెల్యేలు.. దారి తప్పుతున్నారు. నోటి దురుసుతో కొందరు దూకుడు ప్రదర్శిస్తుంటే.. మరికొందరు.. ఇష్టానుసారం వ్యవహరించి.. వివాదాలకు కేంద్రం అవుతున్నారు. తాము ఏం చేసినా.. అడిగే వారెవరు.. అనుకుంటున్నారో.. లేక.. ప్రజలు భరిస్తారులే.. అని భావిస్తున్నారో.. తెలియదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. నిత్యం ఏదో ఒక వివాదంలో అయితే.. చిక్కుతున్నారు.
తాజాగా.. పోచంమైదాన్‌లో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే Narendera దిష్టిబొమ్మ దహనం చేసేందుకు పద్మశాలీయులు యత్నించారు. దీంతో అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పద్మశాలీయులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే నరేందర్ పద్మశాలీలను కించపరిచేలా… మగ్గంపై కాలుపెట్టి దుర్మార్గంగా వ్యవహరించారని పద్మశాలీయులు ఆరోపించారు. రోడ్డుపై భైఠాయించి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే అయితే.. ఎవరికి ఎక్కువ? అనే వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే దిష్ట బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. వారిని పోలీసులు అడ్డుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించేందుకు.. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో నరేందర్ కూడా రంగంలోకి దిగి ప్రచారం ప్రారంబించారు. నియోజకవర్గంలోని పోచం మైదాన్‌లో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ మెజారిటీగా ఉన్న చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లారు. టీఆర్ ఎస్ కే ఓటు వేయాలని.. నేతన్నలకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో చేస్తోందని ఆయన చెప్పారు. అయితే.. ఈ క్రమంలో ఆయన ఒక ఇంట్లో మగ్గంపై కాళ్లు పెట్టి మాట్లాడారనేది నేతన్నల ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఆయన క్షమాపణలు చెప్పాలని.. డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సోమవారం జరిగిన ఈ ఘటనకు మంగళవారం వారు రోడ్డెక్కారు అయితే.. అధికార పార్టీ నాయకులు మాత్రం ఈ వివాదం వెనుక.. బీజేపీ నేతలు ఉన్నారని.. వారు ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…