Political News

కాంగ్రెస్‌కు మోడీ భారీ షాక్‌!!

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుతో ఒక‌రి త‌ర్వాత‌..ఒక‌రుగా విచార‌ణ‌లుఎదుర్కొంటూ.. ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్న కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల‌కు.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో భారీ షాక్ ఇచ్చింది. ఈ దెబ్బ‌తో కాంగ్రెస్ కోలుకోవ‌డం.. క‌ష్ట‌మ‌నే వాద‌న కూడా వినిపిస్తుండడం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. ఈ షాక్‌తో రాహుల్ త‌న భార‌త్ జోడో యాత్ర‌ను అర్ధంత‌రంగా విర‌మించుకుని హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిపోయారు.

ఏం జ‌రిగింది?

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి చెందిన రెండు ఎన్జీఓలకు కేంద్రం షాక్ ఇచ్చింది. విదేశీ విరాళాల సేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆ రెండు ఎన్జీల ఎఫ్సీఆర్ఏను అంటే.. విదేశాల నుంచి విరాళాలు సేక‌రించేందుకు వినియోగించుకునే లైసెన్సులను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్‌జీసీటీ) చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. నిధుల దుర్వినియోగం, ఆదాయపు పన్ను దాఖలు చేసేటప్పుడు వివ‌రాల‌ను వక్రీకరించడం సహా, చైనా, విదేశాల నుంచి నిధులు పొందుతూ మనీలాండరింగ్కు పాల్పడుతున్నాయని అధికారులు తెలిపారు.

హోం శాఖ లైసెన్సులు రద్దు చేసిన రెండు ఎన్డీఓలకు సోనియాగాంధీ ఛైర్పర్సన్గా ఉన్నారు. ట్రస్టీలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నేత చిదంబరం, ప్రియాంక గాంధీ.. తదితరులు ఉన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్.. 1991లో ఏర్పాటైంది. అణగారిన వర్గాలు, గ్రామీణ పేదల అవసరాలను తీర్చేంచుకు రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ను 2002లో నెలకొల్పారు.

ఇదిలావుంటే.. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న భార‌త్‌ జోడో యాత్ర తెలంగాణ‌లో ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. దీనిని ర‌ద్దు చేసుకుని.. ఆయన హైద‌రాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి న్యూఢిల్లీకి వెళ్లిపోయారు.

This post was last modified on October 23, 2022 2:42 pm

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

7 minutes ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

49 minutes ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

1 hour ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

2 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

2 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

3 hours ago