రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో భారీ విజయాన్నందుకున్న మెగాస్టార్ చిరంజీవికి ఆ తర్వాత ఆశించిన ఫలితాలు దక్కట్లేదు. ‘సైరా నరసింహారెడ్డి’కి మంచి టాకే వచ్చినా.. సినిమా మీద పెట్టిన బడ్జెట్‌కు తగ్గట్లుగా వసూళ్లు రాబట్టలేకపోయింది. పాన్ ఇండియా స్థాయిలో అద్భుతాలు చేస్తుందనుకున్న సినిమా వేరే భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఓవరాల్‌గా అది కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఇక ‘సైరా’ తర్వాత చిరు చేసిన ‘ఆచార్య’ ఎంత చేదు అనుభవం మిగిల్చిందో తెలిసిందే.
ఇక చిరు లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ తొలి వారాంతం వరకు సందడి చేసి ఆ తర్వాత చల్లబడిపోయింది. ఓవరాల్‌గా ఈ సినిమా ఫలితాన్ని ‘యావరేజ్’గానే అభివర్ణించాల్సి ఉంటుంది. ఇక మెగా అభిమానుల ఆశలన్నీ బాబీ దర్శకత్వంలో చేస్తున్న కొత్త చిత్రం మీదే ఉన్నాయి. ఈ చిత్రానికి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.
దీపావళి కానుకగా సోమవారం ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు. ఒక వీడియో ద్వారా టైటిల్ రివీల్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఒక ప్రి టీజర్ వదిలారు. అందులో వెనుక నుంచి చిరు ఊర మాస్ అవతారాన్ని చూపించారు. బీడీ తీసుకుని నోట్లో పెట్టుకుంటున్న దృశ్యం చూపించారు. ఇది యాజిటీజ్ ‘కొదమ సింహం’ నుంచి తీసుకొచ్చిన సీనే. వెంటనే మెగా అభిమానులు ఆ విషయం కనిపెట్టి ‘కొదమ సింహం’లోని సన్నివేశం తాలూకు వీడియోను షేర్ చేస్తున్నారు.
ఐతే పాత సినిమాను కాపీ కొట్టాడని బాబీ మీద వారికేమీ కోపం రావట్లేదు. అభిమానుల్లో చాలామందికి ఇది నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తోంది. బాబీ ఫిల్మోగ్రఫీని గమనిస్తే అతనేమీ కొత్త తరహా సినిమాలు చేయడు. పాత సినిమాల నుంచే స్ఫూర్తి పొంది హీరోల అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తాడు. ‘వాల్తేర్ వీరయ్య’కు సంబంధించి కూడా చిరు, బాబీ ముందు నుంచి చెబుతున్నదేమంటే.. చిరు ఇందులో అభిమానులు మెచ్చేలా వింటేజ్ స్టయిల్లో కనిపిస్తాడని. చిరు ఊర మాస్ సినిమాల్లోని మూమెంట్స్‌ను గుర్తుకు చేసేలా సినిమా ఉంటుందని.. కొదమసింహం మాత్రమే కాక రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ లాంటి మాస్ సినిమాల స్టయల్లో ఇది సాగుతుందన్నది స్పష్టం.
This post was last modified on October 23, 2022 3:01 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…