ఏపీ బీజేపీలో కీలక నాయకుడు.. మాజీ మంత్రి.. కన్నా లక్ష్మీనారాయణ కమలం గూటికి రాం రాం చెప్పనున్నారు. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు.. దీనికి ముందు నుంచి కూడా.. ఆయనకు ఎదురవుతున్న వరుస పరాభవాల నేపథ్యంలో.. కన్నా.. పార్టీ మారేందుకు రెడీ అయ్యారని తెలిసింది. రాష్ట్ర నాయకత్వంపై కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్న కన్నా.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్య అనుచరులతో భేటీ అయినా.. పార్టీ మార్పుపై ఆయన దృష్టి పెట్టారు.
2019 ఎన్నికలకు ముందు వరకు రాజకీయంగా అచేతనంగా ఉన్న.. కన్నా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశతో.. ఆ పార్టీలో చేరారు. ఆయన ను ఈ పదవి వరించింది. అయితే.. పార్టీనిసరైన విధంగా.. ముందుకు నడిపించలేక పోయానని.. దీనికి అనేక కారణాలు ఉన్నాయని.. ఆయన తర్వాత.. కాలంలో ఒప్పుకొన్నారు. ఈ క్రమంలోనే ఆయన పగ్గాలు వదులుకోవాల్సి వచ్చింది. పైగా.. అప్పట్టో పదవిని ఆశించిన… ఒక కీలక కాపు నాయకుడే.. తనకు అడుగడుగునా.. అడ్డు తగిలారని.. కూడా కన్నా చెప్పుకొచ్చేవారు.
గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు ఎమమ్మెల్యేగా గెలిచిన కన్నా..వైఎస్ హయాంలో మంత్రి గా కూడా పనిచేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన.. వివాదరహితునిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కుమారుడు గుంటూరు నగర మేయర్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌లో 30 ఏళ్ల అనుబంధం ఉన్న కన్నా.. రాష్ట్ర విభజనతర్వాత కూడా.. పార్టీలో కొనసాగారు. అయితే.. పార్టీ పుంజుకునే పరిస్థితి లేకపోవడంతో.. ఆయన పక్క చూపులు చూశారు. ఈ క్రమంలో తొలుత వైసీపీ నుంచి ఆఫర్ వచ్చింది.
అయితే.. బీజేపీ రాష్ట్ర చీఫ్ పదవి ఇస్తాననడంతో ఆయన అటు మొగ్గారు. అయితే.. ఇప్పుడు.. సోము వీర్రాజు హయాంలో కన్నాకు ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న కన్నా.. జనసేనలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్టు తెలిసింది. పవన్‌తో చనువు ఉన్న కన్నా.. గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనూ.. అనేక మార్లు.. పవన్‌తో తన ఛాంబర్‌లోనే భేటీ అయిన సందర్భాలు ఉన్నాయని అంటారు. ఈ క్రమంలో ఆయన \జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. కన్నా వంటి సీనియర్ నాయకులు, మచ్చలేని నాయకులు.. వస్తానంటే.. పవన్ కాదనడు కాబట్టి..ఆయనకు ఢోకాలేదు. సో.. దీనిపై ప్రకటనే తరువాయి అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates