జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎప్పుడూ లేని రీతిలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. మొన్నటివరకు ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిన ఏపీ అధికారపక్ష నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ నేతల మధ్య రచ్చ మొదలైంది. అధిపత్య పోరు విషయంలో తగ్గేదేలేదన్నట్లుగా వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. గత వారంలో రెండు ప్రాంతాల్లో వైసీపీ నేతల మధ్య నెలకొన్న అసమ్మతితో.. హత్యలు చోటు చేసుకోవటం సంచలనంగా మారింది.
మరోవైపు.. ఉత్తరాంధ్ర ముఖద్వారంగా చెప్పే విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న అధిపత్య పోరు వైసీపీలో ప్రకంపనల్ని సృష్టిస్తోంది. రాజ్యసభ సభ్యుడు.. జగన్ కు అత్యంత సన్నిహితంగా చెప్పే విజయసాయిరెడ్డిపై విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీసత్యనారాయణ చేసిన సంచలన ఆరోపణలు షాకింగ్ గా మారాయి. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెలరేగిపోయారు. విజయసాయిరెడ్డిపై విమర్శలు.. తీవ్ర ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
ఆయన విమర్శనాస్త్రాలు సొంత పార్టీకే కాదు.. ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా లాగటం ఇప్పుడు సంచలనంగా మారింది. విశాఖపట్నంలో అక్రమాలు.. భూదందాల్ని కుటుంబ సభ్యుల చేత విజయసాయిరెడ్డి చేయిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. విజయసాయిరెడ్డి అతి పెద్ద అవినీతిపరుడని.. అక్రమార్కుడన్న వైసీపీ ఎంపీ.. విశాఖపట్నంలో ఆయన పెత్తనం ఏమిటి? అని సూటిగా ప్రశ్నించారు.
అంతేకాదు.. సొంత మీడియా సంస్థను ప్రారంభిస్తానని.. అందులో భాగంగా టీవీ చానల్.. పత్రికను కూడా పెడతానని చెప్పిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఆయన పార్టీ పెట్టటం ఒక్కటే ఆలస్యం’ అంటూ ఫైర్ అయ్యారు. తాను ఆత్మగౌరవం ఉన్న వ్యక్తినని.. ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదన్నారు. ‘నాకు ఆత్మగౌరవం ఉంది. విజయసాయిరెడ్డిలా గులాంగిరి నచ్చదు’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు సామదానబేధ దండోపాయాలతో విశాఖలో విలువైన భూములు తీసుకుంటున్నారన్న తీవ్ర ఆరోపణ చేశారు.
తన బురదను తానే పూసుకోవాలని.. కానీ విజయసాయిరెడ్డి మాత్రం తన బురదను ఇతరులకు అంటిస్తున్నారన్నారు. విజయసాయి రెడ్డి తన మురికి కడుక్కున్న తర్వాత ఇతరుల గురించి మాట్లాడాలన్నారు. ఆయన చేస్తున్న భూదందాపై ప్రధానమంత్రి కార్యాలయం ఏం చేస్తుందని ప్రశ్నించటం గమనార్హం.
చంద్రబాబు ప్రభుత్వంలో జరిగింది ఇన్ సైడ్ ట్రేడింగ్ అయితే.. ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతున్నది ఇన్ సైడర్ ట్రేడింగే కదా? అని ప్రశ్నించటం సొంత పార్టీ నేతలు సైతం షాక్ తింటున్నారు. విజయసాయిరెడ్డి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారని.. దానికి పీఎంవో మద్దతు ఇస్తుందా? అంటూ ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా ఎంవీవీ సత్యానారాయణ వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది.
This post was last modified on October 14, 2022 2:04 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…