రాజమహేంద్రవరం అన్నంతనే గుర్తుకు వచ్చేది రోడ్ కమ్ రైలు వంతెన. నిత్యం భారీగా రాకపోకలు సాగే ఈ రహదారిని తాత్కాలికంగా మూసివేయటం.. రాకపోకల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు తూర్పుగోదావరి కలెక్టర్. మూడు రాజధానులకు వ్యతిరేకంగా.. అమరావతినే రాజధానిగా ఖరారు చేయాలన్న డిమాండ్ ను వినిపిస్తూ నిర్వహిస్తున్న పాదయాత్ర ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తమ వాదనకు భిన్నంగా అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రను ఇప్పటికే పెయిడ్ పాదయాత్రగా ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకత్వం.. తాజాగా మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న వారు సైతం రోడ్ల మీదకు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఉదంతాలు ఇప్పటికే తెర మీదకు రావటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తమ పాదయాత్రకు ఇబ్బందులు పెట్టేలా రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయటంతో తమకు కాస్త సమస్యగా మారినా.. తమ షెడ్యూల్ మాత్రం మారదని స్పష్టం చేస్తున్నారు. రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ మీద రాకపోకల్ని నిలిపివేయటం కారణంగా.. మహా అయితే పాదయాత్ర మరో రెండు రోజులు టైం పెరుగుతుందే తప్పించి మరింకేమీ ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. తాము అనుకున్న మార్గంలోనే పాదయాత్రను కొనసాగుతుందని చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఈ నెల 17న బ్రిడ్జ్ మీద నుంచి అమరావతి రైతుల పాదయాత్రను వెళ్లనుంది.
పాదయాత్రను టార్గెట్ చేస్తూ.. రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి మీద రాకపోకల్ని నిలిపివేసిన కారణంగా స్థానికులు ఇబ్బందులకు గురి అవుతున్నట్లు చెబుతున్నారు. వంతెన రిపేర్ల కారణంగా రాకపోకల్ని మూసివేస్తున్నట్లుగా కలెక్టర్ ప్రకటించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పాదయాత్రను అడ్డుకోవటం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఆ వాదనకు బలం చేకూరేలా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిను మూసివేస్తూ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న కొద్దీ పాదయాత్ర చేస్తున్న వారిలో పట్టుదల పెంచటంతో పాటు.. ప్రజల్లోనూ సానుభూతి వ్యక్తమవుతుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 14, 2022 2:39 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…