Political News

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. ఈ విషయంలో ఇప్పటిదాకా పెద్దగా నోరు విప్పని పవన్ కల్యాణ్… మంగళవారం మాత్రం ఈ దిశగా వస్తున్న ఆరోపణలపై ఓ రేంజిలో వివరణ ఇచ్చి అందరి నోళ్లను మూయించారని చెప్పక తప్పదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని విభజించిన తీరుకు నిరసనగా తాను అన్నిరోజుల పాటు అన్నం తినలేదని తాజాగా పవన్ చెప్పారు.

2014లో పవన్ చేసిన ఆ వ్యాఖ్యల సందర్శంగా అన్ని రోజుల పాటు తాను అన్నం ఎందుకు తినలేదన్న విషయాన్ని ఆయన నాడు చెప్పలేదు. దీంతో ఆ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని పవన్ ను తెలంగాణ వ్యతిరేకిగా చూపే యత్నం జరిగింది.

ఇక మంగళవారం నాటి జనసేన నవ నిర్మాణ సంకల్ప సభను వ్యతిరేకించిన సందర్భంగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా నాటి పవన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఒప్పుకోని పవన్ కు తెలంగాణతో ఏం పని అని వాదించిన సంగతి తెలిసిందే.

నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి దక్కని నేపథ్యంలో హైదరాబాద్ లోని తన ఇంటి వద్దే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పవన్…తెలంగాణ పట్ల తన మనసులో ఉన్న భావాలను నిర్భయంగా వెల్లడించారు.

తాను 11 రోజుల పాటు అన్నం తిననది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనందుకు కాదన్న పవన్.. రాష్ట్రాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజించిన తీరుకు నిరసనగా అన్నం తినలేదని చెప్పారు. ఈ విషయంపై ఎవరేమనుకున్నా కూడా తనకు పెద్దగా పట్టింపేమీ లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

This post was last modified on June 2, 2026 9:21 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

6 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

7 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

7 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

9 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

11 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

11 hours ago